అమ్మ ప్రేమ:- యం.జనని -ఆరవ తరగతి-ఆదర్శ పాఠశాల వల్లాల
 ఈ ప్రపంచంలో అమ్మ అనే పదం కన్నా విలువైన పదం మరొకటి లేదు. మన చరిత్రలో మనం పుట్టక ముందు తెలిసింది అమ్మ ప్రేమ ఒక్కటే.
అమ్మని మించిన దైవం మరొక్కటి లేదు. అమృతం లాంటి ప్రేమను పంచేది అమ్మ.
నాకు మాటలు నేర్పుతూ తను కూడా నాలాగే మాట్లాడుతుంది. నా రేపటి భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తుంది. అమ్మకు ఆశయాలు ఎన్ని ఉన్నా నా సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది. అమ్మ ప్రేమ కన్నా గొప్పదైన ప్రేమ మన జీవితంలో మరొకటి  ఉండదు.
ప్రతిక్షణం మన గెలుపు కోసం పోరాడే బలమే అమ్మ. అమ్మ గొప్పతనం మూడు సమయాల్లో బాగా తెలుస్తుంది. బాగా ఆకలి వేసినప్పుడు అమ్మ చేతి వంట మొదటిగా గుర్తుకు వస్తుంది. అమ్మ ప్రేమ నాన్న ప్రేమ కంటే ఎక్కువ. బాగా బాధగా ఉన్నప్పుడు అమ్మ ముందు ఉంటే వెక్కివెక్కి ఏడ్చాలి అనిపిస్తుంది. చివరగా మనం అమ్మ అయినప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ చేసే పనులు,మనతో పడే కష్టాలు అమ్మకు తప్ప మరొక వ్యక్తికి తెలియదు. ఇన్ని చేసినా అమ్మకు మనం ఏమి ఇచ్చినా తక్కువే. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి మా అమ్మ. అమ్మ అంటే అందమైన ప్రేమ మూర్తి. మా అమ్మ అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే అమ్మ మనకు ఏం కావాలో అడగకముందే అన్ని ఇస్తుంది.

ఈ కథలోని నీతి : అమ్మ ఎప్పుడు మనకు ఒక తల్లిలా కాకుండా ఒక దేవతల ఉంటుంది.

 
కామెంట్‌లు