ఇలా ..అయితే ...!!-- షాహీన్ సిద్దిఖా .- నల్లగొండ.
ఎవరూ లేని ప్రదేశంలో ఏకాంతంగా
జాబిల్లి వెలుతురులో మహావృక్షం కింద
కూర్చొని పుస్తకం చదువుతుంటే ఆ
అనుభూతి చాలా హాయిగా ఉంటుంది

మనస్సును ఏకాగ్రతగా ఉంచుకొని
ఎప్పటి క్షణాలను అప్పుడే ఒడిసిపట్టి
ఆస్వాదించి సంతోషించాలి .

పక్షుల కిల కిల రావాల మధ్యన 
కోయిలమ్మ తియ్యని గొంతును వింటూ
చదువుతూ ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది.

మనం చేసే పనిని  నిష్ఠగా ,ఇష్టంగా 
చేసినప్పుడే మనకు తృప్తి కలుగుతుంది.
                     
                         ***

కామెంట్‌లు