అవు తెలివి :- ఝాన్సీ, ఆరవ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిటిపాముల , నల్లగొండ జిల్లా
 అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవారు ఆ వ్యక్తికి ఒక ఆవు ఉండేది. ప్రమాదవశాత్తు ఒకరోజు ఆవు కాలు జారి బావిలో పడింది, అది సహాయం కోసం చాలా సేపు అరిచి గీ పెట్టింది. చాలాసేపటి తరువాత గాని ఆవు బావిలో పడింది అన్న విషయం ఆ వ్యక్తి తెలుసుకోలేకపోయాడు. తనకు సేవ చేసిన ఆవును కాపాడాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే అది ముసలిది అయినది, దీనిని ఎలా వదిలించుకోవాలని ఆలోచనలో ఉన్నాడు. అలాంటి సమయం లో బావిలో నుంచి తీయడం అనవసరం అనుకున్నారు. అది కాక ఆ బావిని ఎప్పటి నుండో  పూడ్చేయాలని అనుకున్నాడు. అందుకని దాని మీదనే మట్టి వేసి పూడ్చాలనుకున్నాడు. ఆ పని చేయడానికి తనకు సాయం చేయమని పక్క ఇంటి వారిని కూడా పిలిచారు. అతను బావిలో ఉన్న అవు మీద మట్టి పోయడం మొదలు పెట్టారు. పక్కింటి వారు కూడా ఆవు మీద పారతో మట్టి పోయడం మొదలుపెట్టారు. ఆ బావిలో ఉన్న ఆవుకు  ఏం చేయాలో అర్థం కాక అమ్మా అని అరిచింది. కొద్దిసేపటి తర్వాత ఆదివారం అరవకుండా ఉండిపోయింది. అతను అమ్మయ్య చనిపోయింది అనుకున్నాడు. తర్వాత కొద్దిసేపటికి బావి లోనికి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. తన పైన మట్టి పడుతున్న ప్రతిసారి మట్టి విదుల్చుకుంట మట్టి పైన నిలబడి పైకి రాసాగింది అవు . అతనికి అతని పక్కింటి వాళ్లకి దానిని చూసి ఆశ్చర్య కలిగింది. అలా పైకి వచ్చిన ఆవు తెలివిని మెచ్చిన అతను తన తప్పును తెలుసుకొని అప్పటినుంచి ఆ అవును ప్రేమగా చూడసాగాడు.                        

 నీతి :-ఈ ఆవుకు లాగే మన మీద కూడా ఎంతోమంది దుమ్ము మట్టి పోస్తుంటారు, అలా దుమ్ము మట్టిని దులుపుకుంటా పైకి వచ్చేవారి తెలివైనవారు.

                       

కామెంట్‌లు