21వ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ వ్యాప్తం గా ధూమపానం చేసేవారిలో ఆరు కోట్లా ఇరవై లక్షల మంది ప్రాణాలను కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు చెబుతున్నాయి. అందులో ముప్ఫై లక్షల మంది ఒక్క భారత దేశం లోనే వుంటారన్న సదరు నివేదిక ఆందోళన కలిగిస్తొంది అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరుగురిలో ఒకరి మృత్యువు కేవలం ధూమపానం కారణం గానే సంభవిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. మన దేశ వయోజనుల్లో 35 శాతం మంది ఏదో ఒక రూపంలో పొగాకును వినియోగిస్తున్నట్లు మరొక సర్వే స్పష్టం చేసింది. పొగాకు వినియోగం వల్ల మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బులు, శ్వాసకోశ వ్యాధులు సోకుతున్నాయని డబ్ల్యుహెచ్‌ఒ ఏనాటి నుంచో చెప్తూనే ఉంది. అయినా వాటి వినియోగం తగ్గడం లేదు.. 1981 నుండి దేశం లో పొగాకు వినియోగించే వారి సంఖ్య ఏటా మూడు శాతం పెరుగుతొంది. ధూమ పానం, మద్య పానం స్టెటస్ సింబల్ గా భావిస్తూ, వీటిని సేవించని వారిని ఎందుకూ కొరగాని వారుగా భావించడం జరుగుతోంది. ఏటా కాన్సర్ వలన సంభవిస్తున్న మరణాలలో 62 శాతం ధూమ పానం, మద్య పానం వినియోగదారులే వున్నారని 2017 లో జాతీయ ఆరోగ్య మండలి ప్రజలను హెచ్చరించింది. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభుత్వం ఏటా వివిధ రూపాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేస్తోంది. ఈ ఉత్పత్తు లను అమ్ముకునేందుకు అధికారికంగా లైసెన్సు లు ఇస్తోంది. దీంతో ఎక్కడపడితే అక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. దేవాలయాల ముందు, పాఠశాలల ముందు ఒక్కచోటేమిటి మంచి నీళ్లు దొరకని గ్రామాలున్నాయేమోకానీ బీడీలు, సిగరెట్లు దొరకని గ్రామాలు దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఒకపక్క ఆదాయం కోసం లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మరో పక్క సాగును నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు సమంజసం? కాగితాలపై చట్టాన్ని చేసి చేతులు దులుపుకుంటే ప్రయోజనం ఉండదు. అంత కంటే ముందు పొగాకు సాగు మీద ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవాలి. నిషేధం వల్ల జీవనోపాధి కోల్పోతున్నవారికి ప్రత్యామ్నాయం చూపాలి. ఇక మద్య పానం విషయం లో ప్రభుత్వాలు మరీ చిత్రమైన వైఖరి అవలంబిస్తున్నాయి. ఏటా మద్య పానం కారణం గా మూడు లక్షల కుటుంబాలు ఆర్ధికం గా చితికిపోయి దారిద్ర రేఖ దిగువకు జారిపోతున్నారని 2014 లోనే జాతీయ కుటుంబ సంక్షేమ మండలి హెచ్చరించింది. అయితే ఇవేమీ పట్టని ప్రభుత్వాలు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా భావించి ఇష్టా రాజ్యం గా లైసెన్సులు ఇవ్వడం ప్రారంభించాయి. ఫలితం గా వీధికో మద్యం షాపు నెలలొనే పరిస్థితి ఏర్పడింది. ఇక గ్రామీణ ప్రాంతాలలో విచ్చలవిడిగా బెల్టు షాపులను ప్రారంభించి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మద్య పానం కారణం గా సగటున నగరాలలో వినియోగదారులు 30 శాతం, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు సగటున 60 శాతం తమ ఆదాయాన్ని మద్య, ధూమ పానం కోసం వినియోగిస్తున్నారని , అందువలన ఈ రెండింటినీ వెంటనే నిషేధించాలని సామాజిక నిపుణులు, వైద్యులు, సంఘ సంస్కర్తలు దశాబ్దాలుగా విజ్ఞ~ప్తి చెస్తున్నా అవి ప్రభుత్వాల ముందు బధిర శంఖారావమే అవుతొంది. దేశం లోనికి వేగం గా చొచ్చుకు వస్తున్న పాశ్చాత్య విష సంస్కృతి వలన ఈ విషపు అలవాట్లకు ఎక్కువగా యువత బానిసలైపోతుండడం బాధాకరమైన విషయం.వీటికి నగరాలలో మత్తు మందుల వ్యసనం కుడా గత అయిదేళ్ళ కాలం లో తోడై యువతను కాటేస్తోంది. సమాజం పట్ల బాధ్యతా రహితం గా ప్రవర్తిస్తూ మన సినిమాలలో కుడా మద్య పానం, ధూమపానం ఒక సహజమైన అలవాటుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలను ఈ వ్యసనల నుండి రక్షించేందుకు పలు స్వచ్చంద సంస్థలు తమ వంతు కృషి చెస్తునె వున్నాయి. అయితే ఈ కృషి కి ప్రభుత్వ పరం గా కూడా మద్దతు తొడైనప్పుడే ధూమ పానం, మద్య పానం నుండి మన సమాజం రక్షించబడుతుంది. ఇప్పటికే కేరళ, బీహార్ వంటి రాష్ట్రాలు సంపుర్ణ మద్య పానాన్ని అమలు చేస్తున్నాయి. మిగితా రాష్ట్రాలు కూడా ఈ రెండు రాష్ట్రాల ప్రయత్నాలను స్పూర్తిగా తీసుకొని ధూమ పాన, మద్య పాన రహిత సమాజం కోసం చిత్తశుద్ధితో కృషి చెయ్యాలి.
ధూమ, మద్య పనం వలన చితికిపోతున్న కుటుంబాలు:- సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి