హాయ్! హౌ ఆర్ యూ? నీకు నేను ప్రతి మూడు నెలలకు ఉత్తరం రాస్తున్నా. నాకెందుకో ఫోన్లో మాట్లాడడం, సెల్లు లో మెస్సేజీలు పంపడం, వీటికన్న పెన్ తీసుకొని ఉత్తరం రాస్తుంటే వచ్చే భావాలు ఆనందం వేరుగా ఉంటుంది. ప్రతి ఉత్తరంలో నా జీవితా అనుభవాలు, నా అభిప్రాయాలు నా ఆలోచనలు నీకు తెలుపుతూ ! ఉన్నా.ఈనాటి నా ఉత్తరంలో నా చిన్ననాటి ముచ్చట్లు చెప్తాను.చదివి దాచిపెట్టుకో. వాటితో పాటు ఓ సర్ప్రైజ్ వార్త అందిస్తాను.
నేను చిన్నప్పటినుండి కొంచెం మొండి
ఘటాన్నే. ఏదైనా అంతర్గత కావాలని పట్టుబడితే, ఇంక అది నా చేతికి వచ్చేవరకు రచ్చ చేసే దాన్ని.
ఒకసారి నాకు జ్ఞాపకం లేదు, దేనికోసమో పెద్దగా ఏడవడం మొదలు పెట్టాను. ఇంట్లో వాళ్ళు అందరూ నన్ను సముదాయిం చాలని ఎంతో ట్రై చేశారు కానీ నేను నా సంగీతం మాత్రం ఆపలేదు. అప్పుడు మా నాన్నకి కోపం వచ్చి ఓ బిందెనిండా నీళ్లు తెచ్చినాతలమీద
పోసేసాడు.
అప్పుడు నేను ఠక్కున ఏడుపు ఆపేసాను.
ఆ నీళ్లకు, నా కన్నీళ్లకు ఉన్న సంబంధం ఏవిటో ఇప్పటికీ నాకర్థంకాదు.
ఆ సంఘటన మాత్రం గుర్తున్నాది.
దాన్నిబట్టి నాకేమనిపిస్తుందంటే నాలో చిన్నతనం నుంచి ఒక రకమైన మొండి పట్టుదల, ప్రత్యేకమైన ఆలోచనలు నాతో పాటు పుట్టి, నాతోపాటు పెరుగుతున్నాయని తెలుసస్తున్నాది. ఎందుకంటే అప్పటినుంచి ఇప్పటికీ వరకు ఏదైనా చేయాలనుకున్నా ఇక అర్ధరాత్రి వేళలో కూడా,
ఆ పని ముగించే వరకు నిద్రపోను.
అందుకే నేను చిన్నప్పుడే "గుండె జబ్బు మనిషిని" అని ముద్ర వేయించుకున్నప్పటికి నా గుండెలో గూళ్ళు కట్టుకొని ఎన్నో ఆశల విహంగాలు గుసగుసలాడుతుంటాయి. దాని ఫలితమే నేను ప్రారంభించిన బిజినెస్ ఇండియా బార్డర్ దాటగలిగింది.
నాకున్న గుండె జబ్బువల్ల
సంసారానికి నేను పనికిరానని డాక్టర్లు ముద్ర వేసినా, నేను ఆధైర్య పడకుండా నావంటి మరో , అతను, పేరు కొంచెం చిత్రంగా ఉంటుందిలె.యుద్ద వీర్. అతను చిన్నప్పుడు తనకు పెట్టిన పేరు తీసేసుకొని యుద్ధ వీరనే పేరు పెట్టుకున్నాడట.
ఇంకేముంది ఆనందంగా మన దేశ సేవకు సైనికుడైనాడు. కానీ మన దేశబోర్డర్లో జరిగిన ఒక సంఘటనలో యుద్ధ వీర్ కి రెండు కాళ్లు పోయాయి. ఇంటి వద్ద నిరాశతో కూర్చుని ఉన్న అతన్ని గూర్చి తెలుసుకున్న నేను గత వారం పిలిపించి అతనితో సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాను.
వివాహం కేవలం సెక్స్ కోసం కాదు స్త్రీ పురుషులిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండి జీవితాన్ని సంగీత సాహిత్యాది లలిత కళలతో లలిత కళ తోరణంగా మలుచుకొవచ్చు, దేశాభివృద్ధికి, ఔన్నత్యానికి కృషి చేయడం దాంపత్య జీవితంలో ముఖ్యమైనవిషయమని తెలుసుకోవాలి. వేమన చెప్పిన విశ్వమానవ కుటుంబం ఏర్పడడానికి మన వంతు కృషి మనం చేయాలి.
ఇక సంతానం అంటావా? నేను కన్నా, మరొకరికన్నా పుట్టేది ఒక జీవి. అందుకే నిన్న మ్యారేజ్ చేసుకోవడంతో పాటు తో పాటు అనాధాశ్రమం నుండి ఒక పాప ,ఒక బాబును తెచ్చుకున్నాను. బాబుకు ఒక కన్ను ప్రమాదంలో పోయిందట. అయినప్పటికీ ఆ బాబు దీక్షగా చదివి స్టేట్ థర్డ్ వచ్చాడు టెన్త్ క్లాసులో. తనకి చేయూతనిస్తే మంచిదని నా బిడ్డగా చేసుకున్నాను. చిన్న పాపలు ముచ్చటగా ఉంటారు అందుకే ఏడాది నిండని నా పాపకి "ఆదర్శ" అని పేరు పెట్టాను ఏంత ముద్దుగా ఉందో! ఇఅంతా ఎందుకు రాస్తున్నానంటే నువ్వు వచ్చా వంటే ముచ్చటైన నా కుటుంబాన్ని చూచి ఆనందించే వారిలో నువ్వు మొదటి దానివి. కొందరు నారద ,నారదమ్మలు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. ఎందుకంటే నాకు అయినవారు అని చెప్పుకునే వారికి నా ఆస్తిపాస్తులు ఇక దక్కవు కదా అందుకు. ఉంటాను నువ్వు వీలైనంత త్వరలో రా మావారిని పిల్లలను నీకు
పరిచయం చేస్తాను.
నా ఫ్రెండ్ రమ రాసిన ఉత్తరం చదువుకుంటూ నా ఎంతో ఆనందించాను. నాఫ్రెండ్ రమ ఆలోచించినట్లు అందరూ ఎందుకు ఆలోచించారు అని నా మనసులో అనుకున్నాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి