తిరకాసు....!!---షాహీన్ సిద్దిఖా.-నల్లగొండ.

నీతులు చెప్తుంది ,
కానీ ---
నీడను ఇవ్వదు!
సలహాలు ఇస్తుంది ,
కానీ -----
సాయం చెయ్యదు!
బాధ పడితే -
భరోసా ఇవ్వదు !
కానీ---
బాగుపడుతున్నాము
అంటే మాత్రం
బాధ పడిపోతుంది
చిత్రంగా....
ఈసమాజం.....!!
              ***  
కామెంట్‌లు