ఓ మిత్రమా! :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
దీపంలా
వెలుగులుచిమ్ము
మార్గదర్శిలా
ముందుకునడిపించు

కోకిలలా
శ్రావ్యతనివ్వు
కాకిలా
గోలచేయకు

తేనెలా
తీపినిపంచు
కాకరలా
చేదునుమింగించకు

రత్నంలా
మెరువు
దుమ్ములా
కళ్ళుమూయించకు

కాటుకలా
నేత్రాలకందమివ్వు
కారంలా
కళ్ళనుమండించకు

తెలుగులా
వెలుగులుచిమ్ము
హరివిల్లులా
రంగులుచూపించు

పువ్వులా
పరిమళించు
నవ్వులా 
మోములమెరిపించు

అక్షరాల్లా
అల్లుకొను
పదాల్లా
ప్రవహించు

రవిలా
కిరణాలుచల్లు
శశిలా
వెన్నెలనువెదజల్లు

కవితలా
మదులనుతట్టు
కవిలా
కమ్మదనాలనివ్వు


కామెంట్‌లు