మేలుకొలుపులు : -డాక్టర్ అడిగొప్పుల సదయ్య
09.
రేడు కుంకెను తెల్లవారెను రేగె మిత్రుడు తూర్పునన్ 
మోడుబారిన బీడు బెర్గిన మోదుగాకుల దొన్నెలో 
కూడి దాగిన మంచుగడ్డలు కూలి నీరయె,మాధవా!
మేడకుండ్లము మమ్ము గాయగ మేలుకో ధరనేలుకో!

నిఘంటువు:
కుంకెను= అస్తమించెను
రేగె= పైకెగిసెను
మిత్రుడు= సూర్యుడు 
మేడకుండ్లము = అమాయకులము 
కాయగ= కాపాడుటకు

10.
మంచు మాటులు వీగిపోయెను మందసానుడు మీఱగా,
పంచవన్నెల రామచిల్కలు పందిరిళ్ళను మూగగా,
కంచు గంటలు మోగె గోవెల గంజలోచన! వింటివా?
ఎంచ నెవ్వరు నీకు సాటిల? మేలుకో ధరనేలుకో!
==========================

నిఘంటువు:
మాటులు= మరుగు తెరలు
మందసానుడు=సూర్యుడు 
మీఱగా=ఉదయించగా/పుట్టగా
కంజలోచనుడు=విష్ణువు 
ఎంచన్ = లెక్కించగా
-----------------------------------

డాక్టర్ అడిగొప్పుల సదయ్య 
వ్యవస్థాపక అధ్యక్షుడు 
మహతీ సాహితీ కవిసంగమం 
కరీంనగరం
9963991125

కామెంట్‌లు