ప్రతి మహిళ ఒక ఉపాధ్యాయురాలే!
మహిళా-బోధిస్తుంది
మహిళ-సాధిస్తుంది!!!
ప్రతి మహిళ ఒక విద్యాలయం!
ప్రతి మహిళ ఒక విశ్వవిద్యాలయం!!
మహిళ బోధిస్తుంది
మహిళ సాధిస్తుంది!!
ఒక్క మహిళ చదువుకుంటే
కుటుంబం చదువుకున్నట్లే
ఒక్క కుటుంబం చదువుకుంటే
దేశం చదువుకున్నట్లే!!!!!!!!??
మహిళ బోధిస్తుంది -మహిళ సాధిస్తుంది!!
చదువుకుంటే లింగ వివక్ష పోతుంది
చదువుకుంటే వర్గ వివక్ష పోతుంది
చదువుకుంటే కులవివక్ష పోతుంది!!
మహిళా బోధిస్తుంది-మహిళా సాధిస్తుంది!!
చదువుతో జ్ఞానం సంపాదించవచ్చు
చదువుతో ధనం సంపాదించవచ్చు
చదువుతో శాంతి సంపాదించవచ్చు
చదువుతో మనశ్శాంతి సంపాదించవచ్చు.
నిజమైన శ్రామికులు మహిళలు
నిజమైన కార్మికులు మహిళలు
వాళ్లు చదువుకుంటే
ఉత్పత్తి పెరుగుతుంది !
ఆర్థిక శక్తి పెరుగుతుంది!!
గృహాల్లో మహిళలు
కారా గారాల్లో మహిళలు
కర్మాగారాల్లో మహిళలు ఒక్కటే
వాళ్లకు చదువు ఒక్కటే మార్గం
వాళ్లకు బుద్ధి మార్గం ఒక్కటే!!!?
ప్రతి మహిళ ఒక ఉపాధ్యాయురాలే !!
మహిళ బోధిస్తుంది!
మహిళా సాధిస్తుంది!!!
మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి