అభివృద్ధికి దూరంగా గిరిజన గ్రామాలు:- సి.హెచ్.ప్రతాప్
 దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు దశాబ్దాలుగా రహదారుల సౌకర్యాలు కలగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికీ గిరిజనులు ప్రమాదకరమైన వాగులు, వంకలు దాటి వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి . వైద్యసేవలు కొరకు గర్భిణీ స్త్రీలు నేటికీ డోలు మోతలు తప్పడం లేదు.
ఈ ప్రాంతాలలో భారీగా భూములు ఆక్రమణలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో అక్రమాలకు అంతులేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా భూముల ఆక్రమణలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. అనేక ఉద్యమాల నేపథ్యంలో గతంలో గ్రామాలను ఐటిడిఎ పరిధిలో చేర్చడానికి ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను కోరింది. అయినా ఈ ప్రతిపాదన ఇంతవరకు కార్యాచరణకు నోచుకోలేదు. మా గ్రామాల్లో ఎన్నో ఏళ్ల నుంచి సదుపాయాలు లేక అనేక ఇబ్బందులను పడుతున్న పాలకులు గాని అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. కనీసం రోడ్లు, డ్రైన్లు లేవు. తాగునీటి సదుపాయం సక్రమంగా ఉండడం లేదు. రోగాల పాలవుతున్నాం. కరెంటు సమస్యలు చెప్పనక్కర్లేదు అని గిరుజనులు దశాబ్దాలుగా నినదిస్తున్నా ఫలితం వుందడం లేదు.
 
ఆదివాసీ మహిళలను రక్తహీనత సమస్య వెంటాడుతోంది. అంతేకాకుండా ఆదివాసీ మహిళ లకు ప్రసవమంటే పునర్‌జన్మగా మారింది. సకాలంలో వైద్యం అందక పోవడంతో మాతాశిశు మరణాల రేటు పెరుగుతూ వస్తుంది. ఆదివాసీ లు ఆచార, సంప్రదాయాలకు కట్టుబడి మూఢవిశ్వాసాలతో జీవనం సాగిస్తున్నారు. అలాగే తరతరాలుగా వెంటాడు తున్న రక్తహీనత సమస్యతో పాటు పౌష్టికాహార లోపం తో ఆదివాసీలు బక్కచిక్కిపోయి బలహీన పడుతున్నా రు. దీంతో ఆదివాసీలను భయంకర వ్యాధులు చుట్టు ముట్టి యేటా ఎంతో మంది మృత్యువాత పడుతున్నా రు. అదేవిఽధగా ఏజెన్సీలోని ఆదివాసీలను వెంటాడు తున్న పేదరికం, అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో వారు సతమతమవుతున్నారు.  
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోని వారికి  మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.వారి అబివృద్ధి కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది.

కామెంట్‌లు