ప్రాణ స్నేహితులు :- వజ్జ అనిల్-ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 అనగనగా ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టుకి ఒక స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు రాజు అతను రోజు చెట్టుకి నీరు పోసేవాడు వాళ్ళు ఇద్దరు కలిసి మెలిసి ఉండేవారు ప్రతి రోజు రాజు చెట్టు దగ్గరికి వెళ్లేవాడు రోజు చెట్టుతో ఆడుకునేవాడు, చెట్టు కింద పడుకునేవాడు ఆ చెట్టు పండ్లను కోసుకొని తిని కొన్ని తీసుకువెళ్లేవాడు, ఇలా గడిచింది కొన్ని సంవత్సరాలపాటు, ఆ తర్వాత రాజు పెరిగి పెద్దవాడయ్యాడు, ఒకరోజు రాజు వేరే ఊరికి వెళ్లే పని పడింది వెళ్లే దారిలో ఒక కాలువ ఉంది ఆ కాలువను ఎలా దాటాలని ఆలోచించుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, చెట్టుతో అది చెప్పాడు రాజు చెట్టు ఆలోచించకుండా నా కొమ్మలని కోసుకొని ఒక పడవ తయారు చేసుకో అని అన్నది చెట్టు, దానికి సరే అన్నాడు రాజు కొమ్మలు కత్తిరించి పడవ తయారు చేసుకున్నాడు ఆ పడవలోనే కాలువలు దాటుకొని ఆ పని పూర్తి చేశాడు, అప్పుడు రాజు చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టుకు ధన్యవాదాలు చెప్పాడు, కొన్ని రోజుల తర్వాత రాజు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అప్పుడు చెట్టు దగ్గరికి వెళ్లి సమస్యను తన స్నేహితుడైన చెట్టుకు చెప్పాడు, దానికి చెట్టు నా ఆకులను తెంపుకొని బాగా నూరి పసరుగా చేసుకుని మూడు పూటలు అన్నం తిన్న తర్వాత నీళ్లలో ఆ పసరు కలుపుకొని తాగు అని అన్నది, దానికి సరే అని అన్నాడు రాజు,చెట్టు చెప్పినట్లే చేశాడు త్వరగా కోలుకున్నాడు రాజు, కొన్ని రోజులు గడిచాక తనకు ఒక ఇల్లు కావాల్సి వచ్చింది ఎలా ఇల్లు కట్టాలని ఆలోచిస్తూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, నాకు ఒక ఇల్లు కావాలి ఎలా ఇల్లు కట్టుకోవాలో తెలియడం లేదు నాకు కొంచెం సహాయం చేయవా మిత్రమా అని అన్నాడు, అప్పుడు చెట్టు సరే అని అంది నా మొద్దును తీసుకొని ఇల్లును కట్టుకొమ్మని అన్నది చెట్టు, దానికి సరే అన్నాడు రాజు చెట్టు మొద్దును కత్తిరించి ఇల్లు కట్టాడు కొన్ని సంవత్సరాల తర్వాత రాజు ముసలివాడు అయ్యాడు, అది చలికాలం రాజు చలికి తట్టుకోలేక చెట్టు దగ్గరికి వెళ్ళాడు చెట్టుతో అది చెప్పాడు వెంటనే చెట్టు నామీద మంట పెట్టుకో అన్నది చెట్టు, దానికి రాజు మంట పెట్టాడు చలి తగ్గింది,రాజు మళ్ళీ చెట్టుకి ధన్యవాదాలు చెబుదామని చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడ చెట్టే లేదు, అది చూసి రాజు ఎంతగానో బాధపడ్డాడు.

ఈ కథలోని నీతి :మంచి వారితో స్నేహం చేస్తే అంతా మంచే జరుగుతుంది చెడ్డవారితో స్నేహం చేస్తే చెడే జరుగుతుంది

కామెంట్‌లు