నాజీవితం
మలుపు తిరిగిందీ ,
గురువుల జ్ఞానబోధతో ,
వారు మదినిండా నింపిన
క్రమశిక్షణతో !
నా బ్రతుక్కి -
బంగారుబాట పడిందీ ,
స్నేహమంటే ఏమిటో ,
సేవాగుణం ఎలాఉంటుందో ,
చూపించిందీ ---
నేర్పించిందీ ....,
విహారయాత్రలకు -
విజ్ఞాన సమ్మేళనాలకు,
అంకురార్పణ చేసింది,
నన్నొక రచయితగా
మలిచిందీ....
సమాజంలో నాకు,
ఎనలేని కీర్తిని --
ఆర్జించిపెట్టిందీ...
ఇదేకార్యశాల....!
అదే మన--ప్రభుత్వ -
దంత వైద్య కళాశాల !!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి