యాంటీబయోటిక్స్ వలన అనర్ధాలు:-సి.హెచ్.ప్రతాప్
 వ్యాధుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే యాంటీ బయోటిక్స్ యొక్క విచ్చలవిడి వాడకం పై భారతీయ ఆరోగ్య సమాఖ్య ఆందోళన వ్యక్తం చెసింది. అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం, అవగాహన లోపం కారణంగా ఏడాదికి ఏడాది వీటి విచ్చలవిడి వినియోగం దేశంలో పెరుగుతూనే ఉంది. గత దశాబ్దకాలంలో 30శాతం వినియోగం పెరిగినట్టు 2021లో విడుదలైన ప్రపంచ యాంటిబయాటిక్స్‌ నివేదిక నిర్ధారించింది. నిపుణుల అంచనా ప్రకారం యాంటి మైక్రో బియల్‌ రెసిస్టెన్స్‌ కారణంగా 2050 నాటికి ఏటా కోటిమంది మరణిస్తారని అంచనాలు వెలువడ్డాయి.2019లో ది లాన్సెట్‌ పత్రిక  ప్రచురించిన అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా యాంటిబయాటిక్స్‌ వాడే దేశాల్లో మన దేశానిదే మొదటి స్థానం. ప్రాణాలను కాపాడే ఈ మందులను ఇష్టానుసారంగా వినియోగించడంలో కూడా మనమే అగ్రస్థానంలో ఉన్నాం అన్న అంశం ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది.
యాంటిబయాటిక్స్‌ వాడకం వల్ల లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. వీటి వాడకం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియాలు నశిస్తాయని తెలిపింది.
 యాంటిబయాటిక్స్‌ వాడకం వల్ల లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. వీటి వాడకం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియాలు నశిస్తాయని తెలిపింది. జర్మనీలోని హిడెల్‌బర్గ్‌లోని యూరోపియన్‌ మాలిక్యూలర్‌ బయాలజీ లాబోరేటరికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు.
యాంటిబయాటిక్స్‌ల వాడకం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియాలు నాశనమవుతాయని తేల్చారు. ఇవి నశించడం వల్ల గ్యాస్‌ సంబంధిత రోగాలు, ఊబకాయం, తామర, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.సాధారణంగా పిల్లలకు వైరస్, బ్యాక్టీరియాల వల్ల ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ సమస్యలను వైద్యులు గుర్తించి యాంటీ బయాటిక్స్ వాడమని సలహా ఇస్తుంటారు. ఇక అవి వాడిన తర్వాత సమస్య తగ్గిపోతుంది. మళ్లీ ఎప్పుడైనా పిల్లల్లో అలాంటి అనారోగ్య సమస్యలే కనిపిస్తే.. వైద్యుల సూచన లేకుండానే యాంటీబయాటిక్స్ కొంతమంది వాడుతుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని ప్రముఖ పిడియాట్రిషియన్ పేర్కొంటున్నారు.
యాంటిబయాటిక్స్‌ను ఎక్కువగా వాడటం వల్ల బ్యాక్టీరియాలు జన్యుపరిణామం చెంది, మందులను తట్టుకునే శక్తిని పొందుతాయి. దీంతో శక్తివంతమైన యాంటిబయాటిక్స్‌ వాడాల్సి వస్తుంది. చివరకు వాటిలో కొన్ని ఏ మందులకు లొంగకుండా మనుషుల్ని చంపే శక్తిని కూడా పొందుతాయి.ఈ దుష్ప్రభావాలను దృష్టిలో వుంచుకొని యాంటీబయోటిక్స్ ను తగు మోతాదులో అవసరార్ధం మాత్రమే వాడే విధంగా ప్రభుత్వం ఔషధ చట్టానికి మార్పులు చేయాలి. 

కామెంట్‌లు