రంగకు క్రికెట్ పిచ్చి. పాఠశాల నుంచి ఇంటికి రాగానే పుస్తకాల సంచీ ఇంట్లో వేసి, ఆ తర్వాత గంటల తరబడి క్రికెట్ ఆడి వచ్చేవాడు. ఆదివారాలు, సెలవు రోజుల్లో ఇంట్లో అస్సలు ఉండడు. తల్లి అతి గారాబం, తండ్రి పట్టించుకోక పోవడం వల్ల రంగ ఇలా తయారు అయ్యాడు.
రంగ మిత్రుడు రాము రంగకు శతవిధాలా చెప్పాడు, చదువును నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని, పొద్దస్తమానం క్రికెట్ పిచ్చిలో మునిగిపోవడం వల్ల భవిష్యత్తులో పెద్ద దెబ్బే తగిలుతందని చెప్పాడు. మనోడు వింటే ఒట్టు.
సోము రంగకు క్రికెట్ పిచ్చి చిన్నప్పటి నుంచీ అలవాటు చేశాడు. తన మిత్రులు చెప్పే నీతులు అప్పుడప్పుడు సోము వద్ద అంటుంటాడు రంగ. "వారు పెద్ద మూర్ఖులురా రంగా! మనిద్దరి స్నేహం చూసి ఓర్వలేక మనల్ని విడదీసే దురుద్దేశంతో అలా చెబుతుంటారు. ఎప్పటికీ నీకు శ్రేయోభిలాషి మరియు బెస్ట్ ఫ్రెండ్ ఈ సోమూనే గుర్తు పెట్టుకో." అన్నాడు సోము.
10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. సోము అన్ని సబ్జెక్టులలో ఫెయిల్. అతని గురించి ఏనాడూ పట్టించుకోని తల్లిదండ్రులు తమ పరువు తీశాడని సోమును చితక బాదుడు బాదారు. తను ఇట్లా కావడానికి రంగ కారణమని, తనకు క్రికెట్ పిచ్చి అలవాటు చేసింది రంగనే అని చెప్పాడు సోము. ఆ తల్లిదండ్రులు రంగ ఇంటికి వెళ్లి రంగ తల్లిదండ్రులతో పెద్ద గొడవ. ఆ సమయంలో అనిపించింది రంగకు తాను శ్రేయోభిలాషులన మిత్రుల సలహాలు వినక ఎంత పొరపాటు చేశానా అని. తాను ఈ సంవత్సరం 10వ తరగతిలోకి అడుగు పెడుతున్నాడు. ఇకనైనా తనకు మేలు చేసే ఉద్దేశ్యంతో మేలుకొలుపు పాడుతున్న మిత్రుల మాటలు విని, మేలుకోవాలని రంగ గట్టిగా నిశ్చయించుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి