గ్రిగ్స్ పోటీల్లో కడుము పాఠశాలకు పతకాల పంట

 పాతపట్నం నియోజకవర్గం స్థాయిలో 68వ ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గ్రిగ్స్ పోటీల్లో కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పలు విభాగాల్లో అనేకమంది విజేతలుగా నిలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు. నివగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలను వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య ప్రకటించారు.  జూనియర్ బాలికలు వాలీబాల్ పోటీల్లో ప్రథమ, కబడి పోటీల్లో ద్వితీయ, రెండు వందల మీటర్ల పరుగు పందెంలో ప్రథమ, నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ప్రథమ, లాంగ్ జంప్ లో ప్రథమ, డెస్కొస్ అండ్ థ్రో లో ప్రథమ, ఫోర్ ఇంటూ హండ్రెడ్ రిలే పరుగు పందెంలో ప్రథమ స్థానాల్లో నిలిచారని ఆయన తెలిపారు. జూనియర్ బాలురు వంద మీటర్ల పరుగు పందెంలో ప్రథమ, రెండు వందల మీటర్ల పరుగు పందెంలో ప్రథమ, షార్ట్ పుట్ థ్రో లో తృతీయ, డెస్కొస్ థ్రో లో ద్వితీయ, లాంగ్ జంప్ లో ద్వితీయ, ఫోర్ ఇంటూ హండ్రెడ్ రిలే పరుగు పందెంలో ప్రథమ స్థానాల్లో నిలిచారని చిన్నయ్య తెలిపారు. సీనియర్ బాలురు షార్ట్ పుట్ థ్రో లో తృతీయ, డెస్కొస్ థ్రో లో ప్రథమ, లాంగ్ జంప్ లో ద్వితీయ, త్రిబుల్ జంప్ లో ద్వితీయ, జావెలిన్ థ్రో లో ద్వితీయ, రెండు వందల మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానాల్లో నిలిచారని ఆయన తెలిపారు. ఇరవైకి పైగా విజయాలు సాధించిన కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలబాలికలు షీల్డ్ లు, మెడల్స్, ప్రశంసాపత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య, సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావులు విద్యార్థులతో పాటు ‌స్వీకరించారు. బహుమతి ప్రదానం ముగింపు సభకు అధ్యక్షత వహించిన నివగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని సువ్వారి నిర్మల, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం గ్రిగ్స్ అధ్యక్షులు వై.శేఖర్ బాబు, ముఖ్య అతిథి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎద్దు గోపాల దాసు నాయుడు, నిర్వాహక కమిటీ సభ్యులు బొమ్మాళి భాస్కరరావు, కోల రాజారావు, నివగాం ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు లోతుగెడ్డ సింహాద్రి నాయుడు, ఆంగ్ల ఉపాధ్యాయులు డి.రామకృష్ణాచారి, ఉపాధ్యాయులు సి.హెచ్.కాంతారావు తదితర ప్రముఖుల చేతులమీదుగా ఈ బహుమతులను పొందారు. ఇలా వీరితోపాటు నియోజకవర్గం స్థాయిలో గెలుపొందిన ఐదు మండలాల విజేతలను జిల్లా స్థాయి పోటీలకు పంపించనున్నట్లు కొత్తూరు మండల స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జన్ని చిన్నయ్య తెలిపారు. ఈనెల 28,29,30 తేదీల్లో శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆటస్థలంలో జరుగనున్న పోటీలకు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. తొలుత ఈ పాతపట్నం నియోజకవర్గ పరిధిలోగల ఐదు మండలాల 14 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలబాలికల గ్రిగ్స్ పోటీలను పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. విజేతలైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్రకుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు ప్రశంసించారు.
కామెంట్‌లు