శివానందలహరి:- కొప్పరపు తాయారు.

 శ్లో: క్రీడార్ధం సృజని ప్రపంచమఖిలం  క్రీడామృగా స్తేజనా
 యత్కర్మాచరితం మయా చ భవితః ప్రీత్యై భవత్యేవ తత్ !
శంభో న్వస్య కుతూహలస్య కరణం మచ్ఛేష్టితం నిశ్చింతం
తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా !!

భావం:
ఓ శంకరా,! నీవు క్రీడ కొరకై సమస్త ప్రపంచమును సృష్టించుచున్నావు. జనులందరునూ నీకు క్రీడా మృగములు. నేనే పని చేసినా అది నీకు సంతోషమునే కలిగించును. నా చేష్టలు నిశ్చయంగా నీకు కుతూహలం కనుక ఓ పశుపతీ!
 నన్ను సంరక్షించవలసినదే.
                  *****

కామెంట్‌లు