ఏడుపాయల మాఘమాస జాతర :-ఉండ్రాళ్ళ రాజేశం

ఆటవెలది పద్యాలు 

ఏడుపాయలుగను వీడియు పరవళ్ళు
సాగుతున్న తీరు సకల శుభము
మట్టి నేల తడుపు మంజీర తీరము
ఏడుపాయలందు తోడు దుర్గ

వనమునందు వెలసి వనదుర్గ మాతగా
కాచుతుంది తల్లి కన్నులార
శరణు శరణు దుర్గ శక్తి పీఠంబువు
ఏడుపాయలందు తోడు దుర్గ


తానమాడి నదిన తనువంత బండారి
బంతిపూలమాల భజనలందు
కొండ కోనలందు కోటొక్క పూజలు
ఏడుపాయలందు తోడు దుర్గ


మాఘమాసమందు మార్గంబు పరుగులు
పుణ్యతానమాడి పుడమినందు
కోరి మొక్కినంత తీర్చేటి దైవము
ఏడుపాయలందు తోడు దుర్గ


సిరుల కల్పతరువు సింగూరు పరవళ్లు
తల్లి పాదమందు తాండవంబు
రైతు మడులనందు రయమున నిల్చేటి
ఏడుపాయలందు తోడు దుర్గ



కామెంట్‌లు