నేడు ప్రపంచ రేడియో ప్రసార దినోత్సవం : ...అచ్యుతుని రాజ్యశ్రీ

 సారం నిర్మల కాసారం _ నిబద్ధత నిజాయితీతో విశ్వవ్యాప్తం నీవాణి ఓఅశరీరవాణి!
విసుగువిరామమెరుగని అలసటలేని విశ్వమంతటా నీమాటలు పాటలు
సంగీత సాహిత్య పూబోణి 
సమయపాలనలో నీకు నీవే సాటి
లేరెవరుపోటీ
వాణి అశరీర ఆకాశవాణి
ఒంటరి తుంటరి మనసుకు ఊరట! ఉషోదయానికి ముందే
పలకరింపు ఊరడింపు 
పాపాయి మొదలు పండుటాకులవరకు శాంతి చిత్తానికి విశ్రాంతి
మంచిని ఎంచి పంచి పెంచేవు
పల్లెల్లో మాటల మల్లెలతో  కబుర్లపంట పండించే ఊరడించే 
భాష భావం పలుకులకు కులుకులు నేర్పే ఉచ్చారణను సవరించే నీవు శ్రోతలహృదయాలను మీటే విశ్వవిపంచీ _ తీగెలులేని నీవు
అన్నిభాషల్లో ఆదరణ పొందేవు
కుటుంబంలో వ్యక్తిగా మసలేవు🌹
కామెంట్‌లు