చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం,సిద్దిపేట
 *ఆటవెలది*

నివురుగప్పినట్టి నిప్పు కాంతిని చూడు
భగభగాన్చులోన భగ్గుమనును
మనిషిలోన దాగు మానవత్వపుటంచు
మరిచినట్టి రోజు మరుగు నిప్పు
*కందం*
నిప్పులు భగభగమంటును
కుప్పగ జ్వాలలెగసియు కూలును మంటల్
తెప్పగ బూడిదెగసిన
కప్పును పరిసరములందు కన్నులు గాంచన్

*ఉత్పలమాల*

కర్రలు కుప్పలైనగని కాగితమింతను క్రింద దూర్చుతూ
బర్రున పుల్లగీసినను బగ్గున మంటలు పైకిలేసియూ
జర్రున పుల్లలై నడక జారిన జ్వాలల రవ్వలైననూ
వెర్రిగ భూడిదై తలల వెంటను సాగును నిండుచంద్రమై

కామెంట్‌లు