నూతన సంవత్సరమా స్వాగతం:- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-విశ్రాంత సహాయాచార్యుల-హైదరాబాద్
ఆగని కాలం గడిచిపోయే రోజులు
అన్నీ ఆస్వాదించినవే
మనసును హాయి నిచ్చేవి 
చేదును మిగిల్చినవి!!

కొన్ని మంచి కొన్ని చెడు
అన్ని రోజులు మనవి కావు
అనుకోకుండా వచ్చి
కాలగర్భంలో కలిసి
అతలాకుతలం చేసిన క్షణాలు
ఎందరినో బలి తీసుకున్న వైనం
వైభవం 
తగ్గి వెలవెల బోయి
దీనంగా గడిచిన దినాలు!!

గతమెప్పుడూ అనుభవమే
మరిచిపోలేని జ్ఞాపకమే
రానున్నాయి మంచిరోజులు
అంతా శుభం జరగాలని ఆశిద్దాం
మంచిని తోడు తెమ్మని
పాత వత్సరానికి సెలవంటూ
నూతన సంవత్సరాన్ని రమ్మంటూ
సంతోషంగా పలుకుదాం స్వాగతం
సాదర స్వాగతం!!

విశ్వమంతా ఒక్కటయ్యి
జరుపుకునే ఆంగ్ల నూతన సంవత్సర పర్వం
ఆ తేదీలతోనే దినచర్య ఆరంభం!!
------------------------


కామెంట్‌లు