పసివి - మనిషి:-కోరాడ నరసింహా రావు
  పసివి కి  మనిషి కి 
    ఉన్న సంబంధం 
      అవినా భావం...! 

ఆది నుండి మనిషి ది
  పసివితోనే సహజీవనం
   కోడి, కుక్క మొదలు... 
    ఆవు,ఎద్దు,గుఱ్ఱం,గాడిద
  ఇది- అది అనేమిటి.... 
 ఏనుగు,పులి,సింహాలను కూడ వదలలేదు మనిషి! 

అన్నింటినీ లొంగదీసుకుని
 అన్ని ప్రాణుల పైనా... 
  అజమాయిషి చలాయించాడు...! 

అన్నింటినీవినియోగించుకుని,లాభాన్ని, సుఖాన్ని ఆనందాన్నీ పొందు తున్నాడు...! 

అంతేనా..... సృష్ఠి సమస్తాన్నీ... 
   శోధించి విజేతగానిలిచాడు...! 

మనిషి... రాతి యుగం నుండి, రాకెట్ యుగానికి ఎదిగినా... 
   తనను తాను, తెలుసు కోలేక, సత్యాన్ని గ్రహించలేక... 
   ఇతరులను హింసించైనా
 సుఖాన్ని, ఆనందాన్ని పొందాలనుకునే భ్రమ లోనే, ఇంకా బ్రతుకుతున్నాడు..!! 

ప్రేమిస్తేనే... 
  ప్రేమించ బడతామని... 
   ఇతరులను సంతోష పెట్టటంలోనే 
మన సంతోష ముంటుందని 
తెలుసుకో లేకపోతున్నాడు...! 
మనము - మనది అనాల్సిన వాడు... 
 మేము- మాది అని... 
  చివరకు నేను-నాది అంటూ... 
  ఆ ఖ రి కి... ఏదీలేకుండా ఎవరికీ కాకుండ... 
ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి 

పోతున్నాడో కూడా తెలియకుండానే పోతున్నాడు...! 

ఎన్నో తెలుసుకున్న ఓ మనిషి...! 
    ఈ ధర్మ సూక్ష్మమును తెలుసు కొనజాలకే... 
 నీ కిన్నిఅవలక్షణములు... 
 ఈ అశాంతి...! 

తెలుసుకో... నిన్ను నీవు తెలుసుకో... 
   ఈ జగతితో నిజ సుఖానంద సౌఖ్యాలను అనుభవించు...!! 
       ****
కామెంట్‌లు