హరివంశంని గూర్చితెలుసుకుందాం.హరి అంటే శ్రీమహావిష్ణువు అని అందరికీ తెలుసు.మహాభారతంలో ఆఖరిపర్వం హరివంశం.వ్యాసుడు రాసిన దాన్ని నాచనసోముడు ఎర్రాప్రగడ ఆంధ్రీకరించారు. కృష్ణ లీలలున్న హరివంశంలో మొదటిది ఖిలం రెండోది విష్ణుపర్వంలో శిశులీలలు కంసకథ మూడోది భవిష్యపర్వం.
ఇక కృష్ణుని కథలు లీలలు అందరికీ తెలుసు.అష్టమహిషులున్నా ఆయన బ్రహ్మ చారి అంటే విడ్డూరంగా తోస్తుంది.వారంతా అంశలు. సత్యభామ భూమి అంశ.లక్ష్మణ జలాంశ కాళింది తేజస్సుఅంశ.మిత్రవింద వాయువు భద్ర ఆకాంశాంశ. జాంబవతి మనసు రుక్మిణి బుద్ధి నాగ్నజితి అహంకారం.భగవంతుడు జగత్తుకి పతి .భర్త అనే అర్ధంకాక అధిపతి అని గ్రహిస్తే ఈసమస్త జీవకోటికి ప్రతీక 16వేలమంది రాచకన్యలు. జారుడు చోరుడు అని కాకుండ ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి.ఇక విష్ణుద్వేషి ఎడ్డెమంటే తెడ్డెమనేవాడు ఘంటాకర్ణుడు. కుబేరుని అనుచరులలో ఒకడు.చేసిన పాపాలవల్ల పిశాచి గా మారినా శివునిగూర్చి తపస్సు చేశాడు.మోక్షంని కోరాడు." విష్ణువు కృష్ణునిగా అవతరించి బదరికావనంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన్ని శరణు వేడు" అన్న శివుని మాటలతో ఇక చేసేదేమీలేక అక్కడికెళ్లి కృష్ణునికి శరణాగతి చేసి మోక్షాన్ని పొందాడు.బదరీనాథ్ క్షేత్ర పాలకుడైన ఘంటాకర్ణుని దర్శించాలి తప్పక.ఇక్కడ ముఖ్యంగా ఓవిషయం గ్రహించాలి. విష్ణునామం విన్పడరాదనే మూర్ఖత్వంతో చెవులకు గంటలు కట్టుకున్నాడు.దేవుడు భక్తి అనే బీజాలు బాల్యంలోనే నాటాలి. భగవంతుని కథలు చెప్తూ పిల్లల్లో ఆత్మవిశ్వాసం కల్గించాలి.
బాల్యంలో గాంధీజీ ప్రతిదానికీ భయపడేవాడు.చీకటంటే మహాభయం. రంభ అనే వారింటి దాసి బాలగాంధీతో" నీవు రామరామ అంటూ నామస్మరణ చెయ్యి.దేవుడు నీవెంటే ఉంటాడు." బాపూ అంతిమ సమయంలో కూడా " హేరామ్" అంటూ ప్రాణత్యాగంచేశారు. నడిచేదైవం కంచి పరమాచార్య ఒక్కటే చెప్పారు"రోజూ పిల్లల చేత రామనామస్మరణ ఒక ఐదునిముషాలు చేయించండి" అని.హనుమ కథలతో ధైర్యం మనోబలం కలుగుతుంది.కనీసం నిద్రపోయేముందు కథలరూపంలో చెప్పాలి.వారికి మంచినిద్ర పడ్తుంది🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి