ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు
25.
గత జన్మ నీవు చేయగా,
 వెంట వచ్చు పుణ్య పాపాలే! 

ఈ జన్మలో వెన్నంటే, అనుభవాలన్నీ సుఖదుఃఖాలే! 

సుఖవృద్ధే మనిషి ఆశించే ,
 ఆనందాల మురిపాలే!

దుఃఖతీవ్రతే పట్టి ,
పీడించు, అర్భకుల జీవితాలే!

ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!

26.
భూగోళాన ఆవరించే,
 దరిలేని మహాసముద్రాలే!

జీవితాన ఎన్నో. అనేకం,
 అనూహ్యం , భవసాగరాలే!

నిరంతరం ఈదడమే ,
కానరావు సుదూర  తీరాలే!

క్షణం క్షణం మునకలే ,
తరగని భయ సందేహాలే!

ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!

27.
మాతృగర్భాన ఉన్నప్పుడే, మొదలయ్యే ఈ ఒత్తిడులే!

పెరిగే కొద్దీ వెన్నంటి,
 వేటాడే వేదనల శరాలే!

ఆగనివా శరవర్షాలే, అడుగేయగా బీభత్సాలే! 

తెరిపిలేని జీవితాలన్నీ,
తెడ్డే లేని పడవలే!

ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!
____'____
,

కామెంట్‌లు