శివానందలహరి:- కొప్పరపు తాయారు

 శ్లో:
జనన మృతియుతానం
 సేవయాదేవతానం
న భవతి సుఖలేశః సంశయోనాస్తి తత్ర !
అజనిమమృతరూపం సాంబమీశం భజన్తే
య ఇహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభన్తే !!

భావం: జనన మరణములు కలదేవతలను పూజించుట కొంచెం కూడా సుఖము కలుగదు. ఈ విషయంలో సంశయము లేదు. పుట్టుట మరియు గిట్టుట లేని సాంబశివుని సేవించువారు ధన్యులై 
పరమ సౌఖ్యమును  పొందెదరు.
            ********

కామెంట్‌లు