‘విశ్వ హిందీ దివస్’ సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో కవి సమ్మేళనంలో సిరిసిల్ల జిల్లా వాసి పాల్గోన్నారు. హిందీ భాషా ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడానికి జనవరి పదవ తేదీన ‘వరల్డ్ హిందీ డే’ ను సూరత్ పట్టణంలో జరిగింది. ప్రముఖ బాలసాహితీ వేత్త, కవయిత్రి డా.. కందేపి రాణీ ప్రసాద్ కు సూరత్ నుంచి ఆహ్వానం అందింది. హిందీ భాష నుంచి తెలుగు లోకి నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి ఎన్నో అనువాదాలు చేసిన అనువాదకురాలు డా.. కందేపి రాణీ ప్రసాద్ ఈ హిందీ భాషా కవి సమ్మేళనంలో పాల్గొని తమ కవితను వినిపించారు. ఆమె కవిత హిందీ భాషా కవుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకున్నది. హిందీ భాషా కవి సమ్మేళనం లో పాల్గోని సిరిసిల్ల పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టటం సంతోషం. వేసు ప్రాంతంలోని గెయిల్ కాలనీ కమ్యూనిటీ హాలులో జరిగిన ఈ సభకు పండిత్ అశోక్ నగర్, డా.. కమలేష్ జైన్ వసంత్, గౌరవ్ సాక్షీ, సుశ్రీ సోనల్ జైవ్ వంటి ప్రముఖ కవులు పాల్గొన్నారు. రాణీ ప్రసాద్ పుస్తకాలు హిందీలోకి, ఇంగ్లీష్ లోకి, కన్నడం లోకి అనువాదం అయ్యాయి. రాణీ ప్రసాద్ కవయిత్రిగా పర్యావరణం, మెడికల్ సైన్స్ వంటి సమస్యలపై ఎక్కువగా కృషి చేశారు.
హిందీ భాషా కవి సమ్మేళనంలో రాణీప్రసాద్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి