నువ్వు-
నా చూపులకు -
దూరంగా ఉన్నావేమో!
కానీ -
నా నయనాలకు ,
దగ్గరగానే ఉన్నావు...!
నువ్వు-
నా కలలకు -
దూరంగా ఉన్నావేమో!
కానీ -
నా ఆలోచనలలో
దగ్గరగానేఉన్నావు!
నువ్వు-
నా గుండెకు
దూరంగా ఉన్నావేమో!
కానీ
నా గుండె చప్పుడుకు -
దగ్గరగానే ఉన్నావు....!
నువ్వు-
నాకు దూరంగా ఉన్నవేమో,
కానీ ....
నా అణువణువున -
నీవే నిండి ఉన్నావుసుమా....!!
***
నాలో...నీవై...!!-షాహీన్ సిద్దిఖా.-నల్లగొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి