శ్లో:
కళ్యాణి సరస చిత్ర గతి సవేగం
సర్వేంగితజ్ఞమనఘం
ధ్రువలక్షణాడ్యమ్ !
చేతస్తురంగ మధిరుహ్య చర స్మరారే
నేత సమస్త జగతాం
వృషభాధిరూఢ !!
భావం:
ఓ మన్మధ శత్రువా ! సమస్త జగత్తులను ఏలువాడా! వృషభవాహనుడా ! కళ్యాణ వంతమైనది, సరసమైన చిత్రగతులు కలది. వేగముగా పోవునది. సమస్త ఇంగితములను
తెలుసుకొనునది, దోషము లేనిది అగు నా మనస్సనే అశ్వము నెక్కి విహరించుము.
*****
శివానందలహరి:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి