సుప్రభాత కవిత : -బృంద
ఆకాశం పోటెత్తి నట్టు 
అలముకున్న  మబ్బులు 
అవనిని ముంచేయాలని 
ఆత్రంగా దిగుతుంటే...

మింగేస్తాయని భయంతో 
మిన్నకుండి పోయిన నీరు 
మిన్ను విరిగి మీద పడుతున్నా 
కన్నుమూయక చూస్తున్నట్టు...

కలత కమ్ముకున్న మనసు
కనులు తెరచి ఉంచినా 
కలలు మరచి పోయినా 
కదలి పోయి తీరు కష్టాలన్ని!

మంచు దారి నడచువారికి 
మంట ఏదో కనపడినట్టు 
ముంచిన మబ్బుల మాటున 
మార్తాండుని లాగా...

మనసునేదో శక్తి తట్టి 
మేలుకొనగ మేలు చేసి 
వేలు పెట్టి సరి అయిన 
దోవ చూపి వెన్ను తట్టి

జడిసి రాయైన మనసు 
తడిసి నీరై కరిగి 
బిగిసిన పిడికిలిలా ధైర్యంగా 
నడచి పోయేలా....

కొండగా నిలిచే అండలా 
కొత్త వెలుగులు పంచి 
కొదవలు లేక మదికి 
తోడై వచ్చె వేకువకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు