కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆటపాటలతో సందడి చేశారు.
ముగ్గులు వేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అందరూ ఒకరికొకరు మిఠాయిలను పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 2025 కొత్త సంవత్సర కేక్ ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావుకు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈనాటి కార్యక్రమంలో ఉపాధ్యాయులంతా తమ తమ జీవితంలో అధిగమించిన అంశాలను, ఉన్నత స్థాయికి వచ్చేందుకు శ్రమించిన కృషి వివరిస్తూ విద్యార్థులకు స్ఫూర్తి గావించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బాలబాలికలు ప్రదర్శించిన నృత్య రూపకాలు అలరించాయి. ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్రకుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి