న్యాయములు-735
స్వకర కుచ న్యాయము/స్వకుచ మర్థన న్యాయము
*****
స్వ అనగా తాను.కుచ అనగా స్తనము,చన్ను, మర్థన అనగా పిసుకుట, నూఱుట,పిండి చేయుట అనే అర్థాలు ఉన్నాయి.
తన కుచములను తానే మర్థన చేసుకొనుట అని అర్థము.అనగా "తనను తానే పొగడుకున్నట్లు".
ఇది వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది కానీ తరచి చూస్తే మన పెద్దవాళ్ళు ఎందుకు ఇంత కోపంతో ఈ న్యాయము వాడారో అర్థం చేసుకోవచ్చు.
కొంతమంది ఇతరుల గొప్పతనాన్ని ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఇష్టపడక పోతే పోనీ స్వంత డబ్బా మాత్రం విపరీతంగా కొట్టుకుంటూ ఉంటారు. విని విని విసుగెత్తి అలాంటి మూర్ఖులను ఎలా తిట్టాలో తెలియక వాడిన తీవ్ర పదజాలంతో కూడిన న్యాయము ఇది.
ఈ డబ్బా కొట్టడంలో ముచ్చటగా మూడు రకాల డబ్బాల గురించి చెప్పుకోవచ్చు. ఒకటేమో ముందే చెప్పినట్టు తన సొంత డబ్బా తానే కొట్టుకోవడం.ఇదో సుపీరియారిటీ కాంప్లెక్స్ కు చెందిన విషయం.దీనిని "స్వంత డబ్బా" అనొచ్చు.
ఇక రెండోది ఏమిటంటే తనకు నచ్చిన వారికి అడుగులకు మడుగులు ఒత్తుతూ, తన అవసరాలు తీర్చుకోవడానికి కొట్టే డబ్బా.దీనిని పొగడ్త అనవచ్చు. దీనిని పరడబ్బా అంటే "పరులకు కొట్టే డబ్బా" అని అర్థము. ఇది అగడ్త లాంటిది. అవసరం తీరాక అందులోకి తోసే ప్రమాదం ఉంటుంది.
ఇక మిగిలింది "పరస్పర డబ్బా"ఇది.తమ లబ్ధి కోసం ఇరువురూ ఒకరి గురించి ఒకరు అతిగా పొగుడుకోవడం. ఇందులో ఇరువైపులా స్వార్థం ఉంటుంది. రాజకీయ పొత్తులు,వ్యాపారపు జిత్తులు ఇందులో ఉంటాయి.
ఇందులో మొదటిది తనను మభ్యపెట్టుకుని తన స్థాయిని గుర్తించకుండా అతిగా స్పందించడం. రెండవది తన పబ్బం గడుపు కోవడానికి ఇతరులను మభ్య పెట్టడం. ఇక చివరిది ఇద్దరికీ లేదా ఇరువైపులా తెలుసు.తాము చేసేది తప్పేనని తెలిసినా అవసరం గట్టెక్కించుకునేందుకు పైపైకి నటించడం.
ఇలా స్వంత డబ్బా లేదా స్వకుచ మర్థనం చేసుకునేవారిని చూస్తే అసహ్యంగానూ, కోపంగానూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం. ఈ మధ్య కాలంలో ఇలాంటి వారు చాలా మందే తయారయ్యారు.జాలిపడాలనుకున్నా సాధ్యం కాదు.అలాంటి వాళ్ళతో కలిసి తిరిగేవాళ్ళకు, కార్యాలయాలలో పని చేసేవారికి నిత్యం నరకమే. తప్పించుకు తిరగలేక, వద్దని తిరగబడలేక పడే బాధ అంతా ఇంతా కాదు.
కాబట్టి ఎవరికి వారు యుక్తిగా సమస్యను పరిష్కరించుకోవాల్సిందే.అదండీ ఈ న్యాయము లోని అంతరార్థము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి