శివానందలహరి:- కొప్పరపు తాయారు.

 శ్లో: 
కంచిత్కాలముమామహేశ భవతిః పాదారవిందార్చనైః
కంచాద్ధ్యానసమాధిభిశ్చ నతిబిః కంచిత్కథాకర్ణనైః   !
కంచిత్కంచి దవైక్షణైశ్చ నుతిభిః కంచిద్ధశామీదృశీం
యః ప్రాప్నోతి ముదా
త్వదర్పితమనా  జీవన్ స ముక్తః ఖలు !!

భావం: ఓ ఉమామహేశ్వరా ! కొంతసేపు నీ పాద పద్మ పూజలతోనూ, కొంతసేపు నీ ధ్యాన సమాధులతో, కొంతసేపు నమస్కారములతో కొంతసేపు నీ కథలను వినుటతో కొంతసేపు నీ దర్శనముతో కొంతసేపు నిన్ను
స్తుతించుట తో ఎవడైతే సంతోషంగా నీకు మనసు నేర్పించు. ఈ స్థితిని పొందునో వాడు బ్రతికి ఉండి కూడా ముక్తిని పొందినట్లే .
                   ******

కామెంట్‌లు