మా ఇంటి పూలతోట పూలు:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఎంత అందం 
రంగురంగుల ఆనందం నింపే
ప్రకృతి చెమట సిరి
ఇంటి పంట పూవాసన గాలి కెరటాల

మనసు నిండా 
ఇష్టం చేతి కష్టం పరపరాగ పుష్పాలు సౌందర్యం 
నింగి నేలలూగే మనమే
అనిర్వచనీయ ఆనందడోల సుమ హేల

అమ్ములు అమేయ ఆడేపాడే
ఊగే గాలి తేలి అమ్మమ్మ 
చేతికష్టం అందాలు
సిగపూలుగ విరిసిన చిరుసిరి నవ్వుల 


కామెంట్‌లు