ఒక అమ్మ రాసిన 'వీటో ' కథ : - టి. వేదాంత సూరి

 హాయ్ ఫ్రెండ్స్  ! మీకు ఈ రోజు ఒక మంచి పుస్తకం పరిచయం చేస్తాను. మరి చదవండి. ఇందులో నలుగురు మిత్రులు, మీనత్త ప్రధాన పాత్రలు. ఇది మీకోసం డా. హారిక చెరుకుపల్లి రాశారు. ఈ రోజుల్లో సాధారణంగా పిల్లలు సెల్ ఫోన్ చూస్తూ భోజనం చేసే అలవాటు పెరిగింది. గతంలో అమ్మ పిల్లలకు చందమామను చూపిస్తూ , చిన్న , చిన్న కథకు చెబుతూ, పాటలు పాడుతూ కథలు చెప్పే వారు . అయితే ప్రతి అమ్మ ఎలాగైనా తమ పిల్లలకు బొజ్జనిండా అన్నం పెట్టాలనుకుంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. భోజనం చేసేప్పుడు ఒక్క మెతుకు కింద పడితే భవిష్యత్తులో ఒక పూత అన్నం దొరకదు అని పిల్లలకు చెప్పే వారు. మరి రచయిత్రి ఒక అమ్మ కదా . అందులోనూ డాక్టర్ అందుకే అన్నం విలువ , మనం తీసుకునే ఆహారం లో విటమిన్లు , పోషకాహారాలు ఎలా ఉండాలి చెప్పే విధానం చాలా బాగుంది. ఈ తరం పిల్లలు ఇష్ట పడేలా ఇందులో సాంకేతిక పదాలు, ప్రయోగాలు ఉపయోగించారు. పుస్తకం పట్టుకుంది  మొదలు పూర్తి అయ్యే వరకు వదిలి పెట్టారు. ఇందులో పాత్రలైన నలుగురు పిల్లలు చిరు తిండ్లు అలవాటు కావడం వలన అన్నం పై దృష్టి పెట్టక పోయే వారు. ఇది గమనించిన మీనత్త వీరిని ఒక మాయాలోకం లోకి తీసుకెళుతుంది . దీంతో నలుగురు తలోచోటుకు వెళతారు . ఎన్నెన్నో  కస్టాలు పడతారు వీరికి ఆకలేస్తుంది . ఈ సమయం లోనే వారికి అర్ధమయ్యే విధంగా హారిక అక్కయ్య ఆహార విలువలను చెబుతారు. తన పిల్లలకు ఎప్పుడు , ఎలా చెబితే వింటారో కేవలం అమ్మకే తెలుసు కదా. మరి హారిక అక్కయ్య కూడా అమ్మే కదా. అందుకే పిల్లలకు నచ్చే విధంగా కథ నడిపే తీరు బాగుంది. ఇవి టూకీగా కొన్ని పుస్తక విశేషాలు. మీరంతా కొని చదవండి సరేనా . ఈ పుస్తకం పేరు వీటో , వెల 60 రూపాయలు . ఇది అన్ని పుస్తకాల షాప్ లలో దొరుకుతుంది. చదవండి 
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
CONGRATS