తరగని ఆలోచనలకు
కరగని క్షణాలకు
ఎరుగని వేదనలకు
వేకువ ఒక విరామం!
తెలియని ఉత్సాహనికి
కావాలనే కోరికలకు
చేయాలనే పట్టుదలకు
వేకువ ఒక ధైర్యం!
నీరసించిన మనసుకు
అలసించిన నిర్లిప్తత కు
ఆలోచనల కార్య రూపానికి
వేకువ ఒక అవకాశం!
తీసుకున్న నిర్ణయాలకు
మోసుకున్న బరువులకు
వేసుకున్న లెక్కలకు
వేకువ ఒక కొనసాగింపు!
ఆవేశం తగ్గిన తరువాతి
ఆలోచన చేసిన పరిణితికి
చేసిన తప్పుల సర్దుబాటుకు
వేకువ ఒక అవసరం!
కలిగిన వాటికి కృతజ్ఞత
తొలగిన వాటికీ నిశ్చింత
అలసిన మనసుకు ఊరట
కలిగించే కమ్మని వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి