విచిత్రం!!?:-డా ప్రతాప్ కౌటిళ్యా
విశ్వ చిత్రం 
గీసేటప్పుడు 
చుక్క -లేకుండా చూడండి!!

ఆ చుక్కనే
మరో నక్షత్రమవుతుంది!!?

ప్రపంచ పటం 
గీసేటప్పుడు 
మచ్చ లేకుండా చూడండి!!

ఆ మచ్చ 
మరో దేశమవుతుంది!!?

జీవం 
విజయ స్తూపాలు 
చెట్లు!!

మనుషులు 
భూమిపై కదిలే 
సజీవ కట్టడాలు!!!

డా ప్రతాప్ కౌటిళ్యా 🙏.

కామెంట్‌లు