పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న 62వ పుస్తకం "అమ్మ గోరు ముద్దలు" శ్రీశ్రీ కళావేదిక సి.ఇ. ఓ డా.కత్తిమండ ప్రతాప్ గారు, కర్నూలు కన్స్యూమర్ ఫోరమ్ జడ్జి శ్రీ నరహరి నారాయణ రెడ్డి మరియు విచ్చేసిన ప్రముఖ కవులు,కళాకారుల చేతుల మీద కౌత పూర్ణానంద విలాస్,విజయవాడలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న,రమారమి 6 వసంతాల కాల వ్యవధిలో 63 పుస్తకాలు రచించి,పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న అవిరళ కృషిని గుర్తించి "తెలుగు కీర్తి" పురస్కారం ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుడు కేశవయ్య, ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు,కొప్పుల ప్రసాద్ మరియు అతిరథ మహారథులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు.
సోమన్న "అమ్మ గోరు ముద్దలు" పుస్తకావిష్కరణ , 'తెలుగు కీర్తి' పురస్కారం ప్రదానం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి