సైన్స్ ఎగ్జిబిషన్ విజేతలకు రామరాజు ట్రస్ట్ సత్కారం

 వసప కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఆవరణలో గతనెల 30న  జరిగిన మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రథమ స్థానం సాధించి, విజేతలైన పాతపొన్నుటూరు బాలికలకు రామరాజు ట్రస్ట్ ఘనంగా సత్కరించింది. పాతపొన్నుటూరు ఎం.పి.యు.పి.పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పారిశర్ల రామరాజు పుష్పగుచ్చం, నగదు పారితోషికాలను బహూకరించి బాలికలను ఆశీర్వదించారు. గైడ్ టీచర్ గా వ్యవహరించిన అందవరపు రాజేష్ ను, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. బయో గ్యాస్ ప్రోజెక్ట్ ను సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన 8వ తరగతి బాలికలు పతివాడ హరిణి, సవిరిగాన శ్రావ్య,   అందవరపు హిమబిందులను  రామరాజు అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని తోటి విద్యార్థులు కూడా పలు సత్ఫలితాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఈనెల మూడో తేదీన జరుగనున్న జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఈ బయోగ్యాస్ ప్రోజెక్ట్ అర్హత సాధించడం పట్ల రామరాజు హర్షం వ్యక్తం చేసారు. జిల్లా స్థాయిలో కూడా విజయం సాధించాలని ప్రోత్సహిస్తూ ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు పాల్గొని ప్రసంగించారు.
కామెంట్‌లు