గణాలు గుర్తు పెట్టుకోవడం ఎలా?:- డా. సి వసుంధర.-చెన్నై.
 పద్యం రావడానికి సామాన్యంగా 8 గణాలు ముఖ్యం.
వాటిని గుర్తు పెట్టుకోవడానికి మన వాళ్ళు యమాతారాజభానసలగం అనేదాని  నేర్పిస్తుంటాారు బడిలో,ఇంట్లో పెద్దలు.
కూడా.
దానిని ఇలా గుర్తుపెట్టుకోవాలి
యమాతా 
అంటే i u u ఒక గురువు,రెండు గురువులు.అదేమాదిరి 3అక్షరాలు తీసుకొని గణాలను గుర్తించుకోవాలి. 
మొదటి అక్షరంతో ఆగణం పెరు ఉంటుంది.  యగణం  l U U  మొదటి అక్షరం పట్టి యగణం అని దానిపేరు చెప్తారు.
విద్యార్థులు ప్రస్తుతం పై విధంగానే గణాలను గుర్తిస్తున్నారు కానీ దీనికన్నా కొంచెం సులభ మార్గాన్ని నేను తయారు చేశాను అది సులభంగ,శాస్త్ర
బద్దంగా ఉంటుందని అనుకుంటున్నాను. 
         *
దానిని వివరిస్తాను.
          X 
8 గణాలలో  మగణం నగణం  అన్నవి. వేరు చేద్దాం. మగ ణం మూడు గురువులే      u u u 
నగణం మూడు లఘువులే
I i i. ఈ రెండు అలానే గుర్తు పెట్టుకోవాలి.

ఇక పోతే ఆరుగణాలు ఉన్నాయి. 
 
ఈ  ఎనిమిది గణాలు ప్రతి గణం మూడు అక్షరాల చొప్పున ఉంటాయి. కాబట్టి 
ఈ క్రింది విధంగా చార్ట్ వేసుకుంటే సులభంగా అర్థమవుతుంది. 1) లఘువులుతక్కువ
*****
య I U U అదిలఘువు
ర.   u I U మధ్యలఘువు
త.  U U I అంత్యలఘువు
ఇప్పుడు మనం 
య ర. త ఆన్న క్రమాక్షరాలను గుర్తుపెట్టుకుంటే  య మొదటి అక్షరం కాబట్టి 
"ఆది లఘువు యగణం" అని వెంటనే చెప్పచ్చు. మిగతావి అలాగేచెప్పవచ్చు.
    
2)
గురువులు తక్కువ. 
******
లఘువుల మాదిరి గురువులు కూడా 
U l l 
ఆది గురువు   భ గణం
మధ్యగురువు. జ గణం
అంత్యగురువు స గణం
భ జ స 
*******
మనం ఇప్పుడు 
గుర్తుపెట్టుకోవాల్సిందే య ర  త లఘువుల తక్కువ
భ   జ.  స గురువులు తక్కువ. 
య ర త భ జ స అని అని కాసేపు భజన  చేసి నేర్చి పెట్టుకుంటే 
"రగణం ఎలా ఉంటుంది?" అని ఎవరైనా అడిగినప్పుడు వెంటనే య ర త లో రెండవ అక్షరం ర కాబట్టి "మధ్య లఘువు రగణం"అని 
శాస్త్రబద్ధంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది.
ఇది సులభ పద్ధతిలో ఉంటుందని, 8 గణాలను శాస్త్ర బద్దంగా చెప్పొచ్చని
నేను క్లాసులో పిల్లలకు చెప్పి, తద్వారా పిల్లలు ఆ ఎనిమిది గణాలను అడగగానే చెప్పే విధంగా చేసి ఉండటం వల్ల ఇది సులభ పద్ధతి అని అనుకుంటున్నాను .
డా. సి వసుంధర.

కామెంట్‌లు