పిసినారితనం:-పి శివగంగ-ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 అనగనగా ఒక గ్రామంలో పిసినారి పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు, ఆ వ్యక్తి చాలా పిసినారితనం చేసేవాడు, ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే కూడా అన్నం కూడా పెట్టేవాడు కాదు, ఆ వ్యక్తి ఎప్పుడూ పాడైన భోజనం తినేవాడు, ఎప్పుడైనా సంతకిపోతే ఆయన కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్లి, పాడైన కూరగాయలు ఉన్నాయా అని అడిగేవాడు, వాళ్ళ దగ్గర ఉన్న పాడైన కూరగాయలు ఇచ్చేవారు వాళ్ళు, ఆయన పాడైన కూరగాయలు, పాడైపోయినా అన్నం తినేవాడు, ఒకరోజు అతనికి బాగా జ్వరం వచ్చింది, అప్పుడు పిసినారి పాపయ్య డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకున్నాడు, ఆ డాక్టర్ నావల్ల కాదు అని, పెద్ద హాస్పటల్ కు వెళ్ళమని చెప్పాడు, పాపయ్య ఎందుకు డబ్బులు ఖర్చు అవుతాయని వెళ్లలేదు, కొన్ని రోజుల తర్వాత తనకు అసలే చేతకాకుండా అయ్యింది, పెద్ద హాస్పిటల్ కు పోయాడు, అక్కడ ఆ డాక్టర్ నువ్వు పాడైపోయిన భోజనం తిన్నావుగా అందుకే నీకు ఆరోగ్యం ఇలా చెడిపోయింది అని చెప్పి, మందులు రాసి ఇస్తా తీసుకో,వీటికి పదివేలు ఖర్చు అవుతాయని డాక్టర్ చెప్పాడు, పాపయ్య ఇంటికి వచ్చి అమ్మో ఇన్ని డబ్బులు ఖర్చు అవుతాయా!  అని మందులు వద్దనుకున్నాడు, అప్పటికి కూడా అదే పాడైపోయిన భోజనం తినేవాడు, కొన్ని రోజుల తర్వాత పాపయ్య చనిపోయాడు. 

ఈ కథలోని నీతి: అందుకే పిసినారితనం మంచిది కాదు

కామెంట్‌లు