నా మనస్సు పొరల్లో
నీ కోసం చిగురించిన
ప్రేమ .....
నా గుండె గదుల్లో
లోలోతులలో
నాటుకొని పోయింది!
నీకోసం -
ఎంతగానో నిరీక్షించి
నా హృదయం
ఆవేదన చెందింది!
ఆ ఆవేదనలో
ఓ ప్రేమకావ్యమే రాశాను!
నా నయనాల ఆశ్రువులలో
నా అనుభూతులన్ని -
చెదిరిపోయాయి.....!
ఆ జ్ఞాపకాలను ....
నా మది లోతులనుంచి
ఒడిసిపట్టి ఆస్వాదించడం తప్ప
నేనేమి చేయలేను కదా!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి