సంక్రాంతి సోయగo :-డా.ధనాసి ఉషారాణి( సిరిరాగ)భాకరాపేట తిరుపతి జిల్లా
     గుమ్మడి పువ్వులు సోయగాలతో ముంగిలి 
 ముద్దుగా మురిసిపోతేనే నులివెచ్చని మంచులోగిలిలో ముగ్గులు మెరిసేది                                                 
 జగతి మెచ్చిన నిండు పున్నమి లోగిలి సంక్రాంతి పండుగ

కోడిపందాలతో పల్లెలోగిలి మురిసిపోతేనే
కోటివెలుగుల ఆనందాల లోగిలిలో ప్రకృతి మురిసేది                                 
జగతి మెచ్చిన సంబరాల పల్లకి సంక్రాంతి

కమ్మని  పిండి వంటలతో ఇంటిలోగిలి ఘుమఘుమలాడితేనే
ఇంటిల్లి పాటు కమ్మని రుచులతో మురిసిపోయేది
కొత్తరుచులకు నిండు కమ్మని రుచుల తోరణము సంక్రాంతి

కొత్త ఆశల లోగిలిలో  రంగుల గాలిపటం రివ్వున ఎగిరితేనే
కోటి వెలుగుల ఆశల లోగిలిలో మనసు ముస్తాబయ్యేది
శృతిమెచ్చని ఆశలను  మృదువుగా పలికించే ఆశల లోగిలి సంక్రాంతి

పట్టులoగాల జిగిబిగి పలుకుల్లో ఆడపడుచులు మురిసితేనే
రమ్యమైన సంప్రదాయపు లోగిల్లో మనసు ముగ్దభావములో నిలిచేది
నిలువెత్తు సంప్రదాయాలకు నిలువెత్తు హుందాతనం సంక్రాంతి


కామెంట్‌లు