శీల శిఖరుడు -అంబేద్కర్ :-నామ వెంకటేశ్వర్లు, - S A తెలుగు -జి. ప. ఉ. పాఠశాల,-అయిటిపాముల, నల్లగొండ.

 దయామయుడు దీనబాంధవుడు మానవతావాది న్యాయ కోవిదుడు రాజనీతిజ్ఞుడు ఆర్థికవేత్త తత్వవేత్త స్వార్థం అన్యాయం పక్షపాతం తెలియని ప్రపంచ జ్ఞాని ప్రభావశీలి అంతకుమించి  శీల శిఖరంగా పేరిణిక గన్న వారు ఎవరో కాదు వారే బోధిసత్వ డాక్టర్ భీమ్రావు రాంజీ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గొప్ప సుగుణశీలి సుగుణాల ఖని అని అనడానికి ఎన్నో ఉదాహరణలు సందర్భాలు చెప్పుకోవచ్చు,                                 శీలం అంటే గుణం,  శీలం అంటే మంచి నడవడిక, సరైన నడత నైతిక ప్రవర్తన ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని శీలమంటారు. కొందరు శీలమంటే కేవలం స్త్రీలకు సంబంధించిన అనేక శారీరక సంబంధాలుగా అనుకోవడం అలవాయితీ, కానీ స్త్రీలకు పురుషులకు అందరికీ వర్తించిన నైతిక నియమాలుగా అర్థం చేసుకోవాలని అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఉద్యోగులు ఇతర పనులు చేసే వారు ఎటువంటి లంచం ఆశించకుండా సకాలంలో పనులు పూర్తి చేసేవారిని శీలవంతులుగా పిలుచుకుంటారు, అక్రమంగా పదిమందికి సాయం అందించగలిగే వారు శీలవంతులు, కుశల కర్మలు ఆచరించే వారంతా శీలవంతులు, ఓటుకు నోటు తీసుకోకుండా ఓటు వేసే వారు కూడా శీలవంతులే, అలాకాకుండా లంచం పుచ్చుకొనే వారు శీలవంతులు కారు, నియమాలతో బతికే వారందరూ నడుచుకునే వారందరూ శీలవంతులే, శుభ్రతగా ఎటువంటి మలినం అంటకుండా నడిచే నడత కలవారు శీలవంతులని అంబేద్కర్ గారు వివరించారు. విద్యా స్వాభిమానం శీలం ఈ మూడు నేను ఆరాధించే దేవతలని అంబేద్కర్ గారు చెప్పండం జరిగింది. దాన్ని జాగ్రత్త పడాలి. శీలం లేని విద్యావంతులు క్రూర గాల మృగాల కంటే ప్రమాదకారులు అంటారు అంబేద్కర్ గారు. విద్యావంతులు విజ్ఞానలు నిరుపేదలైన అభివృద్ధికి ఉపయోగపడకపోతే వారు సమాజానికి చీడపురుగుల వంటి వారిని అంబేద్కర్ గారు వివరించడం జరిగింది. విద్యా, ధనం ఇవేవీ మనిషికి కొలమానాలు కావు శిలమే ముఖ్యం అని అంగీకరించి బుద్ధుని శరణు వేడాడు అంబేద్కర్, అదే విషయం బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పారు,  చదువు కంటే శ్రీలం గొప్పదని ఇదే విషయాన్ని 1951 అక్టోబర్ 29న పాటియా లలో జరిగిన సభలోను చెప్పారు.              మంత్రి పదవి పోయిన తర్వాత అంబేద్కర్ గారు కొన్ని విషయాలను బయలు పరచాలి వాటిలో కొన్ని మీ ముందు ఉంచుతాను. నన్ను కాంగ్రెస్లో చేరమని ఎంతో ఒత్తిడి దీక్ష ఎంతో ఆశ చూపారు కానీ నేను చేరలేదు నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా మాత్రం చేసినప్పుడు ఎవరు నన్ను ఒత్తిడి పెట్టలేదు, శీలం మీద ఇంత మచ్చ అయినా ఉందా ఉంటే చూపించండి అని సవాల్ విసిరారు. లంచగొండితనం అవినీతి పక్షపాతం బ్లాక్ మార్కెట్ ఇలాంటి వ్యవహారాల్లో నేనెప్పుడూ తల దూర్చలేదు అన్నారు, ఆయనను ఇంతవరకు వేలెత్తి చూపిన వారు ఒకరు లేరు అందుకే ఈ దేశంలో వీధి వీధికి వేలెత్తి చూపే అంబేద్కర్ విగ్రహాలు ఎన్నో ఉన్నాయి.. ( మచ్చ లేని వ్యక్తిత్వం ):- రెండో రౌండ్ టేబుల్ సమావేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి తిరిగి వచ్చాక కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ శాస్త్రి అంతర్జాతీయ శాంతి సదస్సులో డాక్టర్ అంబేద్కర్ గారు సభ్యులుగా పాల్గొనడం భారతదేశ ప్రయోజనాలకే విఘాతం అని ప్రకటించారు, సమావేశానికి శ్రీనివాసులు కూడా వెళ్ళాడు, ఆ మాటకు సమాధానం గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1944 సెప్టెంబర్ 24వ తేదీ న ఇలా తగిన జవాబు ఇచ్చారు, అది నా ప్రజా జీవన రంగంలో తల వంపులు తెచ్చే ఏ పని నేను ఎప్పుడూ చేయలేదు, భారతదేశం తరఫున ఏ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న దేశభద్రతకు దేశ స్వతంత్రానికి విఘాతం కలిగించే మాటలు ఏమీ మాట్లాడడం లేదని అలా నేను ఎన్నడు ప్రవర్తించను లేదని సెప్టెంబర్ 24 సాయంత్రం దక్షిణ భారత బౌద్ధ మహాసభ వారు,  నిమ్న జాతుల సంఘాలతో కలిసి పార్క్ టౌన్ లో జరిగిన బహిరంగ సభలో బాబాసాహెబ్ గారు గట్టిగా సమాధానమిచ్చారు.   కానీ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చాక మద్రాస్ రిబ్బన్ భవన్లో సెప్టెంబర్ లో డాక్టర్ బాబాసాహెబ్ గారికి ఘన సత్కారం జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకు సెప్టెంబర్ 24న మద్రాస్ హేతువాద సంఘం వారు ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ పార్టీ నాయకుడు బాలసుబ్రమణ్యం, మొదలియార్ బాబాసాహెబ్ ఘనంగా సత్కరించారు ఇవి అంబేద్కర్ సుగుణశీలానికి వ్యక్తిత్వానికి ప్రత్యేకంగా చెప్పవచ్చు.  (తాకట్టు పెట్టిన తత్వం)  :- నిమ్న వర్గాల రాజకీయ హక్కుల కోసం డాక్టర్ అంబేద్కర్ తెచ్చిన కమ్యూనల్  అవార్డు విషయంలో గాంధీ తీవ్రంగా విభేదించారు. గాంధీ అంబేద్కర్ ప్రతిపాదన అంగీకరించక దానికి నిరసనగా పునాలోని ఎరవాడ జైల్లో 1932 సెప్టెంబర్ 19 నిరాహార దీక్షకు దిగారు, దీనిపై అంబేద్కర్ స్పందిస్తూ ఇతర మతాల వారికి ప్రత్యేక ప్రాతినిధ్యం ఇస్తే ఐక్యత దెబ్బతినదా? ఒక్క నిన్న జాతుల వారికి ఇస్తేనే దెబ్బతింటుందా? ఇతర మతాల వారికి ఇవ్వడానికి గాంధీ సహిస్తాడు కానీ నిమ్న వర్గాల వారికి ఇవ్వడానికి అతనికి మనసు రావడం లేదు. దేశ ఐక్యత దెబ్బతింటుంది అని గాంధీ అంటాడు అని నిక్కచ్చిగా ప్రకటించారు అంబేద్కర్. కమ్యూనల్ అవార్డు సందర్భంలో బొంబాయిలో మదన్మోహన్ మాలవ్య హిందూ ప్రతినిధుల సమావేశానికి అంబేద్కర్ ని ఆహ్వానించడానికి అహ్మదాబాద్ లో గొప్ప  పారిశ్రామికవేత్త మరియు కోటీశ్వరుడు అయిన వారు అంబేద్కర్ దగ్గరికి వెళ్లి ఆహ్వానిస్తూ మీరు వ్యక్తిగతంగా డబ్బు పుచ్చుకోరు,  అని మీరు ఎంత అడిగితే అంత ధనం ఇస్తాను అధనం అంటరాని వారి అభ్యున్నతికి వాడండి అని బేరం పెట్టాడు. అతనితో డాక్టర్ ఇలా అన్నాడు, అంబేద్కర్ ఆదర్శ నాయకుడు తను అమ్ముడుపోడు తన జాతిని తాకట్టు పెట్టడు అని సమాధానం ఇచ్చాడు,  ఈ మాటల వలన ఇప్పుడు అంటరాని జాతులకు డబ్బు కంటే రాజకీయ హక్కులే ముఖ్యమని పరోక్షంగా తెలుపగలిగారు. బహుజనులకు రాజ్యాధికారం ఎంత అవసరమో అంబేద్కర్ గారి ఈ ఒక్క మాటలో తేటతెల్లం అవుతుంది. బహుజనుల కు రాజ్యాధికారం రావాలంటే బహుజనులని,  నిమ్న జాతుల్ని నడిపించే నాయకులు ముందుగా అమ్ముడు పోకుండా ఉండాలి. జాతి ప్రజల్ని వారి ప్రయోజనాల్ని తాకట్టు పెట్టకుండా నిలబడాలి,  ప్రజలు కూడా నోటుకి ఓటు కొనాలని వచ్చిన వారిని నిలదీయాలి అప్పుడే బహుజన రాజ్యం పరుగులు పెడుతూ మన వద్దకు వస్తుంది అంటాడు అంబేద్కర్. ఇది అంబేద్కర్ గారి యొక్క శీలబలం. తాను అమ్ముడుపోలేదు,  తన జాతిని తాకట్టు పెట్టలేదు ఎన్నడు.  అందుకే శీల మహాబలుడు బాబా సాహెబ్. ఆయన మతం మారే విషయంలో కూడా రకరకాల మతాలవారు రకరకాల ప్రలోభాలకు గురిచేయడానికి ప్రయత్నించినా వారి ప్రలోభాల మాయలో పడకుండా కుల ప్రసక్తి లేని బౌద్ధం స్వీకరించారు. మాయలో పడితే అంబేద్కర్ భారతదేశానికి శాశ్వత గవర్నర్ జనరల్ గా,   హైదరాబాద్ సుప్రీంకోర్టుకు శాశ్వతంగా ప్రధాన న్యాయమూర్తిగా, కోట్ల ఆస్తిపరుడుగా మరియు గురునానక్ అంత స్థానం దక్కేది.  అంబేద్కర్ గారు శీలం లేనివాడు కాదు. అందుకనే డాక్టర్ అంబేద్కర్ గారిని గొప్ప శీల శిఖరంగా పిలుచుకునే వ్యక్తి,  ఇప్పటివరకు అతని శీలం శంకించిన వారు లేరు, శీలహీనుడిగా ప్రవర్తించిన ప్రవర్తన లేనే లేదు అంటే అతిశయోక్తి కాదు. అంబేద్కర్ ఆటు విదేశీయులతోనే ఇటు స్వదేశీయుల తోనూ అంతగా గౌరవించబడ్డాడoటే అతని యొక్క శీలమే అతన్ని పరిపూర్ణ వ్యక్తి గా, ప్రపంచ మేధావి గా నిలబెట్టింది. ఇక ఇలాటివి ఎన్నో సందర్భాలు ఉన్నాయి.
కామెంట్‌లు