విద్యార్థి:నామ వెంకటేశ్వర్లు, - S A తెలుగు -జి. ప. ఉ. పాఠశాల,-అయిటిపాముల, నల్లగొండ.

   విద్యార్థి.....
 ఓ విద్యార్థి నిదురపోకు ఇపుడు మేలుకో ఎప్పుడు,                                          
*అహార్య ప్రదర్శనలో పోటీపడినట్టే 
పఠనములో చూపించు నీ సత్తా. 
   *బజారు ల్లో పచార్లు    చేయక,         
నీ     బ్రతుకును పదిలపరుచుకో 
*బస్టాండ్లలో బాతకాని మాని భవిష్యత్తును చక్కదిద్దుకో  
*సినిమా థియేటర్లో షికారులు మాని
 ఒక శిల్పిగా నీవు తయారు కావోయ్ 
*కాలక్షేపంతో కాలంగడిపితే 
కొన్నాళ్లకు కనిపిస్తుంది కటిక చీకటి నీకు
\ 4*యుక్తితో చదివితే ఎన్ని యూనిట్లైనా తిరిగేయొచ్చు                                 
*ముందుగా నీపై నీవు నమ్మకం  విశ్వాసం పెంచుకో 
*ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా 
*దిక్కుతోచని స్థితిలో దిక్సూచిలా దిక్కు చూపించేది ఒక విద్య మాత్రమే 
*అభ్యాసం కృషి పట్టుదలతో నీ లక్ష్యం గమ్యం వైపు సాగిపో ఆకాశం అంచుల దాకా .

కామెంట్‌లు