మిస్రగతి గజల్: - -వి.వి.వి.కామేశ్వరి (v³k) వెలగలేరు
వెన్నెల వెలుగున దీపం పెట్టీ చాలదనుటలో అర్థం ఉందా!
చీకటి బ్రతుకున వెలుగులు పంచని మనిషుండుటలో స్నేహం ఉందా!

కష్టంలోనూ చేయూతిచ్చే వారేలేరని చింతనయేలా!
మదిగదిచేరీ మరులూరించని మనసుండుటలో మోసం ఉందా!

వెండికొండయే హిమనీనదమై కరుగుట చూసీ కుములుటమేలా!
తియ్యని మాటలు పలుకని మౌనం కోసేయుటలో మర్మం ఉందా!

చెల్లని నోటుకు ఓటునువేసీ గెలిపించుటయే మానవధర్మం
మంచిని పెంచే హృదయంలేదని రోదించుటలో ధర్మం ఉందా!

వరమేదైనా పొందాలంటే అర్హత ఒకటీ సరిపోతుందా!
నిప్పును కడిగే ఆచారంతో వెలివేయుటలో న్యాయం ఉందా!




కామెంట్‌లు