మీ కొడుకుకూ, కోడలికి ఒక్క క్షణం కూడా పడదట కదా! ఇరవై నాలుగు గంటలు కొట్టుకుంటునే వుంటారని మా కోడలు చెప్పింది" ఆసక్తిగా అడిగింది అన్నపూర్ణమ్మ.
" అందుకే నేను ఏ చీకు చింతా లేకుండా ఆరోగ్యం గా , ఆనందం గా వుండగలుగుతున్నాను" పళ్ళీలు నములుకుంటూ చెప్పింది అనసూయమ్మ.
"ఇదేదో టెక్నిక్ బాగానే వున్నట్లు వుంది, నేను కూడా నా ఇంట్లో ఉపయోగిస్తే హాయిగా తిని కూర్చోవచ్చు" సంతోషంగా అంది అన్నపూర్ణమ్మ.
2.." ఏం తింటున్నారండి అసలు మీరు, లేస్తే పడిపోయేటట్లు అంత బలహీనంగా వున్నారు" ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ అయోమయం.
"పొద్దస్తమానూ మా ఆవిడ చేత మొట్టికాయలు, అప్పడాల కర్రతో దెబ్బలు" నీరసంగా జవాబిచ్చాడు నారాయణ.
3. " నీ మీద హత్యా ప్రయత్నం చేస్తున్నది నీ రెండో సెటప్ అయిన రంభ అనే ఎలా చెప్పగలరు" అడిగాడు ఇనెస్పెక్టర్ రాజు.
" మరి నేను నామినీ గా ఆవిడ పేరుతో మూడేళ్ళ కింద పది లక్షలకు ఇన్సూరెన్సు తీసుకున్నట్లు ఈ మధ్యే ఆవిడతో మాట వరుసకు చెప్పాను" అసలు సంగతి విచారంగా చెప్పాడు మహేశ్వర్.
4."దొంగతనం కేసులో దొరికాక శిక్ష అనుభవించి, ఫైన్ కూడా కట్టక వెంతనే మళ్ళీ నిన్ను పోలీసులు ఇక్కడకు పట్టుకొచ్చేసారా ? ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు గంగులు.
" కోర్టులో నేను కట్టినవి దొంగ నోట్లు అని వాళ్ళకు తెలిసిపోయింది." బాధగా చెప్పాడు బండ రాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి