వెల్కటూరు గ్రామంలో సారంగపాణి అనే వైద్యుడు ఉన్నాడు.అతడు సిద్దిపేటలో ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో పనిచేస్తున్నాడు.
ప్రతిరోజు అతని కోసం భార్య పొద్దున్నే లేచి స్నానానికి వేడి నీళ్లు కాగబెట్టి,తినడానికి వేడి వేడి టిఫిన్ తయారుచేసి పెట్టేది.అవి ముగించుకొని సారంగపాణి ఆసుపత్రికి బైక్ పైన బయలుదేరేవాడు. మార్గమధ్యలో ఉన్నప్పుడు ఆస్పత్రి నుంచి నర్సు ఫోన్ చేస్తుంది.హలో! సార్! ఒక పేషంట్ మన హాస్పిటల్ లో జాయిన్ అయి చాలా సీరియస్ గా ఉన్నాడు. వెంటనే రండి అని అంటుంది.
అలాగే వస్తున్నానుఅని ఫోన్ కట్ చేసి వెళ్తున్నాడు.
కొద్దిదూరం వెళ్లగానే తన భార్య నుంచి ఫోన్ వస్తుంది. ఏమండీ!మనకు లేక లేక కలిగిన మన కుమారుడు దినేష్ కాలేజీ వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆక్సిడెంట్ లో చనిపోయాడని ఇప్పుడే నాకు కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. అని బాధతో ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది. వెంటనే రండి ఆసుపత్రికి వెళదాం అని భార్య అంటుంది. సారంగపాణి కాసేపు శోకసంద్రములో మునిగిపోయాడు.
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.బాగా ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.
కొడుకు దినేష్ ఎలాగు చనిపోయాడుమళ్ళీ రాడు. కానీ కన్న తల్లిలాగా భావించే ఆసుపత్రిలో ఉన్న పేషంటునైన కాపాడుదాం అని బాధను దిగమింగుతూ ఆసుపత్రికే వెళతాడు.
ఆ పేషెంట్ వాళ్ళ నాన్న డాక్టర్ను చూసి చాలా కోప్పడతాడు.ఎందుకు ఇంత ఆలస్యం వృత్తి ధర్మం పట్ల ఇంత నిర్లక్ష్యమా!అని నిలదీస్తాడు.నా కొడుకు చనిపోయేలా ఉన్నాడు త్వరగా వెళ్ళు వెళ్లి కాపాడు అని పేషెంట్ వాళ్ళ నాన్న అంటాడు.
ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి నా కొడుకు కూడా ఇంత వయసు వాడే అని బాధపడుతూ పేషెంట్ కి ఆపరేషన్ చేసి మంచి మందులు ఇచ్చి రక్షిస్తాడు.
నీ కొడుకుకేమి ప్రమాదం లేదని పేషంటు వాళ్ల నాన్నకు భరోసా ఇస్తాడు.
నర్స్ నేను వెళుతున్నాను. అక్కడ నా కొడుకు ప్రమాదవశాత్తు చనిపోయాడు అని ఏడుస్తూ సారంగపాణి ఇంటికి బయలుదేరుతాడు. ఇదంతా పేషెంట్ వాళ్ళ నాన్న గమనిస్తాడు.డాక్టర్కు ఏమైందమ్మా? ఏడుస్తువెళుతున్నాడు అని నర్సు నడుగుతాడు. నర్సు ఇలా చెబుతుంది.డాక్టర్ కొడుకు చనిపోయినాడు మళ్లీ రాడు అని గుండె నిబ్బరం చేసుకొని నీ కొడుకు ప్రాణాలు కాపాడాలని ఆస్పత్రికి వచ్చాడని నర్సు చెబుతుంది. ఆ పేషెంట్ వాళ్ళ నాన్న కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు.అయ్యో! సారంగపాణి డాక్టర్కు ఎంత ఆపద వచ్చింది.నేను అనవసరంగా డాక్టర్ను తిట్టానని మనసులో ఎంతో బాధపడ్డాడు.
వృత్తి ధర్మం అంటే ఇది. అందరు డాక్టర్లు ఇలా ఉంటే పేషెంట్ల ప్రాణాలకు ప్రమాదం ఉండదనే నీతిని పేషెంట్ వాళ్ళ నాన్న తెలుసుకుంటాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి