పరికింపగ అందము:- --గద్వాల సోమన్న ,9966414680
కొలనులోని కలువలు
పుడమిలోని మొక్కలు
పరికింపగ అందము
ముద్దులొలుకు బాలలు

సదనంలో వనితలు
గగనంలో  తారలు
పరికింపగ అందము
వదనంలో నగవులు

ఆకుపచ్చ పొలములు
కవి కరమున కలములు
పరికింపగ అందము
తరువులోని ఫలములు

తనువుపైన వలువలు
బ్రతుకులోన విలువలు
పరికింపగ అందము
మనసులోని మమతలు

హృదయంలో ప్రేమలు
ఉదయంలో వెలుగులు
పరికింపగ అందము
పసి పిల్లల ముఖములు


కామెంట్‌లు