యువతకు శాపంగా మారుతున్న నైపుణ్య లేమి;- సి. హెచ్ . ప్రతాప్

 మన దేశం లో యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య నైపుణ్య లేమి.దీనితో యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లి నిరుద్యోగ సమస్యతో పెడత్రోవ పడుతున్నారన్నది నిర్వివాదాంశం.ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం లో 15-35 సంవత్సరాల వయస్సు గల యువత నేటికీ నైపుణ్యాభివృద్ధి వైపు దృష్టి సారించలేకపోవడం, నైపుణ్యం గలవారు కేవలం 2-3 శాతం మాత్రమే వుండడం సరైన నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు రాక పొట్టకూటి కోసం అరకొర జీతాలతో తీవ్ర నిరాశతో యువత తమ జీవితాలను నెట్టుకురావడం దేశ ప్రగతికి పెద్ద అవరోధం అని చెప్పకనే చెబుతొంది.మన దేశం లో విధ్యార్ధులు మూస చదువులు, మార్కుల చట్రం లో కూరుకుపోయి నైపుణ్యాభివృద్ధి వైపు దృష్టి సారించడం లేదు.తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, ఆ దిశగా ఆలోచించకుండా ఇంజనీరింగ్, మెడిసన్ లో తప్ప ఇంకెక్కడా భవిష్యత్తు లేదని, పిల్లలో మొగ్గ స్థాయి నుండే బలం గా నాటి , వారిని రోబోలుగా తయారు చేయడం తో విద్యార్ధుల జీవితాలు ఊసురోమంటూ జైలు గోడల్లాంటి స్కూళ్ళకే పరిమితమైపోవడం , భవిష్యత్తు తరాలు ఏమైపోతాయన్న బాధ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. గ్రామీణ ప్రాంతాలలో అయితే సరైన అవగాహన  లేకపోవడం, నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, స్కూళ్ళలో వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత, ఎంతో మంది విధ్యార్ధుల విధ్యార్ధి జీవితాలను మొగ్గలోనే చిదిమేస్తోంది.మన ప్రభుత్వాలు కూడా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి యువతను నైపుణ్యాభివృద్ధి వైపు మళ్ళించకపోతే పూర్తి స్థాయి నిరుద్యోగులు తయారవడానికి ఎంతో కాలం పట్టదని గుర్తించి 2015 జులై  15 వ తారీఖున ప్రధాన మంత్రి కౌశల్ భరత్ పధకానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. చదువు మానేసినా,నిరక్ష్యరాస్య యువతను గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే లక్ష్యం తో ఈ పధకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.ఈ పధకం ద్వారా కెంద్ర ప్రభుత్వం 79.5 లక్షల మందికి , అదే రాష్ట్ర ప్రభుత్వం అయితే 20.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చే విధానాన్ని రూపొందించి , దాని కొరకు 12 వేల కొట్ల నిధులను కేటాయించారు.ఆంధ్రప్రదెశ్ లో 3.8 లక్షల మంది, తెలంగాణాలో 3.5 లక్షల మందికి శిక్షన అవసరమని ప్రభుత్వాలు గుర్తించాయి.2015 లో ఈ పధకం ప్రారంభించినప్పటికీ , దురదృష్టవశాత్తు ఇప్పటివరకు గ్రామీణ యువత ఈ పధకానికి ఆమద దూరం లో వుండడం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిస్తొంది.గ్రామీణ ప్రంతాలలో ఈ పధకం అమలు క్షేత్ర్ స్థాయి నుండే లోపభూయిష్టం గా వుందని గణాంకాలు ఎత్తిచూపడం దురదృష్టం. క్షేత్ర స్థాయిలో అధికారులు, స్వచ్చంద సంస్థల సహకారం తో ప్రసార మాధ్యమాల ద్వారా ఈ పధకం వివరాలను యువతకు చేరవేయడం మరియు శిక్షణా కేంద్రాలను రెట్టింపు చేస్తే తప్ప  లక్ష్యాలను చేరుకునే అవకాశం వుండదు.గ్రామ సర్పంచులు, గ్రామం లో విద్యావంతులు ఈ పధకం మలులో భాగస్వాములైతే తొందరగా మెరుగైన ఫలితాలను సాధించవచ్చు.  2025 నాటికి ఐ టి రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మెషీన్ లెర్నింగ్,రోబొటిక్స్వంటి రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా అయిదు కోట్ల ఉద్యోగాల అవకాశాలు, భారత్ లో రెండు లక్షల ఉద్యోగాలు ఏర్పదతాయని అయితే దురదృష్టవశ్శాత్తు వాటిని అందిపుచ్చుకునే నైపుణ్యాలను ఐ ఐ టిలు, తప్ప ఏ ఇతర ఉన్నత విద్యా సంస్థలు విద్యార్ధులకు అందిచ్చే పరిస్థితులు లేవని సి ఐ ఐ ఇటీవలే కుండ బద్దలు కొట్టింది. దేశీయంగా ఉన్నత విద్యా సంస్థలలో విద్యా ప్రమాణాలను గణనీయంగా పెంచాల్సి వుందని మేధావులు, ఇతర సంస్థలు గొంతు చించుకుంటున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడం నిజంగా దురదృష్టకరం.
కామెంట్‌లు