ఎలా నవ్వరో నేను చూస్తా:- డా.సి.వసుంధర.
 ఓసారి మహాకవి ఆరుద్ర గారికి పొట్ట  ఆపరేషన్ చేయడానికి డాక్టర్ అన్ని సిద్ధం చేశాడు. అప్పుడు ఆరుద్ర గారు డాక్టర్ని "డాక్టర్ గారు!నేను ఒకసారి నా పొట్టలోకి చూడవచ్చా?"అని అడిగాడట. దానికి డాక్టర్ ఎందుకయ్యా అంటే," అందరూ అంటుంటారు కదా, పొట్టపొడిస్తే లేదా పొట్టకోస్తే అక్షరమ్ముక్క  రాదని. అందుకనే నా పొట్టలోఅక్షరం ముక్కలు ఏమైనా ఉన్నాయో లేవో చూసుకుందామని" అన్నాడటనవ్వుతూ.
ఒకసారి సభలో కొందరికి అనుమానం వచ్చింది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్న పాట రాసిన వారి పేరు శంకరంబాడి  సుందరాచారా? లేక 
సుందరం బాడీ శంకరాచారా? అని
అనుమానం వస్తే
అప్పుడు సభలో ఉన్న 
డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఏదైతే ఏమయ్యా ఎక్కడో ఒక చోట " బాడీ" ఉన్నది కదా అన్నారట అంతే, సభంతానవ్వుల పువ్వులు.
హాస్యం అంటే బలవంతంగా నవ్విచ్చేది కాదు, బలవంతంగా ఆపుకున్న ఆగకుండా నవ్వించేది హాస్యం.
😌😊😝😃



కామెంట్‌లు