రసగుళికలు ...!!: --డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 నాఆలోచనల్లో 
నిత్యం నువ్వేవుంటావు !
నీఆలోచనల్లో ...నేను,
నావునికిని వూహించలేను !!
---------------------------------------(1)
మదిలోనిన్ను ,
వూహించుకుంటేచాలు,
యవ్వనం బుసకొట్టి 
శరీరం నిలువునా స్పందిస్తుంది !!
---------------------------------------------(2)
మనం కలిసిన క్షణాలు 
నీకు గుర్తున్నాయోలేదో !
నాకుమాత్రం -ఆజ్ఞాపకాలే ,
జీవనమంత్రాలైనాయి ....!!
-----------------------------------------------(3)
నిన్నూ -నన్నూ 
ఎవరేమిఅనుకున్నా 
నువ్వేమిటో నాకు తెలుసు !
నీకుఁతెలుసు నేనేమిటో ....!!
------------------------------------------------(4)
అందరికళ్ళల్లో ఎందుకో ,
నువ్వెవుంటావు ....!
నీకంటిలోమాత్రం ...నేను
నన్నే ఊహించుకుంటాను!!
-------------------------------------------------(5)
నువ్వు అలిగితే
బుజ్జగించాలనిపిస్తుంది..!
నీకు కోపం వస్తే....
నిన్నే డిపించాలనిపిస్టుంది....!!
----------------------------------------------------(6)
                       ***
కామెంట్‌లు